బెంగళూరు కు చెమటలు పట్టించిన ఢిల్లీ!

  • Published - 06:01 PM, Tue - 27 April 21
బెంగళూరు కు చెమటలు పట్టించిన ఢిల్లీ!

ఎబి డివిలియర్స్ తుఫాను లాంటి ఇన్నింగ్స్తో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిపించాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బెంగళూరుకు ఇది ఐదో విజయం. మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి లేకుంటే ఐపీఎల్ లో అద్భుత విజయాలు అందుకున్న ఏకైక టు బెంగళూరు గా నిలిచేది. ఒకప్పుడు పూర్తిగా ఫెయిల్ మోడ్ లో ఉన్న జట్టు ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న బెంగళూరు అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ ఉంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి విజయం సొంతం చేసుకుంది.

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బెంగళూరును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. మంచి ఫామ్లో ఉన్న దేవదూత్ పడిక్కాల్, కెప్టెన్ కోహ్లీలు వెంట వెంటనే అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్, పతిదర్ లు వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు. 23 రన్స్ చేసిన మాక్స్వెల్ అవుట్ అయిన తర్వాత పతిదర్ కూడా అనవసర సార్ కు ప్రయత్నించి అవుట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ మైదానంలో బౌండరీలు తుఫాను మోత మోగించాడు. ఢిల్లీ బౌలర్లు అప్పటి వరకూ ఎంతో పద్ధతిగా ప్రణాళిక వేసిన ఢిల్లీ బౌలింగ్ తీరు ఎబి డివిలియర్స్ వచ్చిన దగ్గరనుంచి మారిపోయింది. డివిలియర్స్ వచ్చి రాగానే ఎదురు దాడికి పాల్పడడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఢిల్లీ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సిక్సర్లతో విరుచుకుపడిన ఎబి డివిలియర్స్ 45 బాల్స్ లో 73 రన్స్ చేసాడు. చివరి ఓవర్ లో ఏకంగా మూడు సిక్స్ లు కొట్టి, 23 రన్స్ సాధించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 172 రన్స్ చేసింది.

173 రన్స్ సాధించాల్సిన పరిస్థితి లో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఓపెనర్ లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అనవసర. షాట్ లకు పోయి వికెట్స్ సమర్పించుకున్నారు. ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్ కేవలం 6 రన్స్ చేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్ కూడా యాదవిధిగా విఫలం అయ్యాడు. పెద్ద స్కోర్ చేయకుండానే స్టోనిస్ కూడా అవుట్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పెద్దగా ప్రభావం చూపక పోవచ్చు అని భావించారు. అప్పటికే క్రీజులో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ కూడా మెల్లగా ఆడటంతో విజయం మీద ఎవరికీ పెద్దగా అసలు కూడా లేవు.

ఐదో బ్యాట్స్మెన్ గా వచ్చిన హిట్ మేయర్ ఢిల్లీ ఆశలను సజీవంగా ఉంచాడు. ఎంతో ధాటిగా ఆడుతూ చివరి ఓవర్లలో బౌండరీల మోత మోగించాడు. అప్పటివరకు ఏ మాత్రం అసలు లేని ఢిల్లీ క్యాపిటల్స్ కు హిట్ మేయర్ రాకతో, అతడి బ్యాటింగ్ ప్రభావంతో కొత్త ఆశలు వచ్చాయి. సుమారు నలభై బాల్స్ తేడాతో ఉన్న లక్ష్యాన్ని మెల్లగా బౌండరీల మోత తో దగ్గర చేసాడు. చివరి రెండు బాల్స్ లో 10 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో రెండు బాల్స్ ఫోర్ లు వెళ్లాయి. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. చివర్లో ఎంతో గొప్పగా ఆడిన హిట్ మేయర్ అందరి అభిమానం చూరగొన్నాడు. కనీసం ఆశలులేని ఢిల్లీ క్యాపిటల్స్ ను మళ్లీ పోటీలోకి తీసుకురావడంలో అతడు మంచి ఆటతీరును కనబరిచాడు.

బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్లను ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. పాయింట్స్ టేబుల్ లో పైన ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తన విజయాల జైత్రయాత్రను కొనసాగిస్తూ హైదరాబాద్ను కూడా మట్టి కరిపించి పైన ఉండేందుకు తాపత్రయపడుతోంది.

Show comments