ముంబై బలహీనతలు ప్రత్యర్థులు అర్ధం చేసుకుంటున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పద్ధతిగా వెళితే ముంబై ని ఓడించడం పెద్ద కష్టమేమి కాదు అన్న సంగతి ఇప్పుడిప్పుడే ఐపీఎల్ లో మిగిలిన అన్ని జట్లకు అర్థం అవుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్లు అన్నింట్లో అనూహ్యంగా పుంజుకునే ముంబైకు ఇప్పుడు ప్రతి మ్యాచ్ కష్టతరంగానే మారుతుంది. ఇటీవల ఢిల్లీ చేతిలో ఓడిపోయిన ముంబై, శుక్రవారం పంజాబ్ చేతిలో ఓటమి మూటగట్టుకుంది. దీంతో ఐదు మ్యాచ్లలో మూడు మ్యాచ్లు ఓడిపోయి కష్టాల్లో పడింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ అందుకు తగ్గట్టుగానే బౌలింగ్ చాలా ఏకాగ్రతతో చేసింది. ముంబై బ్యాట్స్మెన్లు ఎంత కష్టపడినా డ్రమ్స్ తీయకుండా తగు జాగ్రత్త వహించింది. వికెట్స్ మీద దృష్టి పెట్టకుండా రన్స్ కట్టడి చేయడానికి పంజాబ్ బౌలర్లు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమి అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ తో పంజాబ్ బౌలింగ్కు నాయకత్వం వహించి ముందుకు నడిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులోనే ఉన్నప్పటికీ పరుగులు తీయడానికి ఆపసోపాలు పడ్డాడు. వికెట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఇషాంత్ కిషన్ రన్స్ తీయలేక బాల్స్ ఎక్కువగా తీసుకున్నాడు. తన ఖాతా తెరవడానికి 4 బాల్స్ తీసుకున్న అతడు తర్వాత ఒక్కో రన్ కొట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ముంబై బ్యాట్స్మెన్ అందరూ మెల్లగా బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ టెస్ట్ క్రికెట్ ను తలపించింది. చివర్లో పోలార్డ్ సిక్స్ కొట్టినా, గట్టిగ ఆడటానికి మాత్రం అనువైన వాతావరణం కనిపించలేదు. దీంతో కేవలం 131 రన్స్ మాత్రమే ముంబై చేయగలిగింది.
132 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు వికెట్స్ కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించింది. మెల్లగా ఆడుతూనే, స్కోర్ పెంచుతూ వికెట్లను పోకుండా చాలా జాగ్రత్తగా ఆడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సైతం వికెట్స్ పడకుండా, భారీ షాట్లు ఆడకుండా పలు జాగ్రత్తలు తీసుకొని మెల్లగా ఆడుతూ వచ్చారు. లక్ష్యం పెద్దగా లేకపోవడంతో మెల్లగా లక్ష్యం వైపు కదలడానికి సింగిల్స్ తీశారు. మెల్లగా తమ టార్గెట్ ను పంజాబ్ బ్యాట్స్మెన్ సాధించారు.
శనివారం రాజస్థాన్ రాయల్స్ కోల్కత నైట్రైడర్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు మూడు మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన నేపథ్యంలో కచ్చితంగా విజయం కోసం గట్టిగా పోరాడతాయి. ఇరు జట్లు బలాబలాలు సమానంగానే ఉన్నా కాస్త మొగ్గు కోల్కతా వైపే ఉంటుంది. శనివారం మ్యాచ్ కూడా ఎంతో రసవత్తరంగా సాగుతుంది అని క్రీడా పండితులు భావిస్తున్నారు.