హైదరాబాద్ నిలిచెన్.. గెలిచెన్!

  • Published - 01:31 PM, Wed - 21 April 21
హైదరాబాద్ నిలిచెన్.. గెలిచెన్!

ఎట్టకేలకు సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో బోణి చేసింది. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయి అభిమానుల నిరాశ తో, వారి మద్దతు పోగుట్టుకునే దశలో సన్రైజర్స్ హైదరాబాద్ పుంజుకుంది. శ్రీరామనవమి కావడంతో బుధవారం ఐపీఎల్ రెండు మ్యాచ్లు జరిగాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ సన్రైజర్స్ పంజాబ్ కింగ్స్ ని ఎదుర్కొంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ కేవలం 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో హైదరాబాద్ సునాయాసంగా విజయ లక్ష్యాన్ని చేరుకుంది.

టాస్ గెలవగానే మరో మాట లేకుండా పంజాబ్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లు హైదరాబాద్ బౌలర్లను ఎదుర్కోలేక నానా పాట్లు పడ్డారు. పవర్ ప్లే లో కనీసం బౌండరీ లేక, హైదరాబాద్ బౌలర్లు వేసే మంచి లైన్ అండ్ బంతులు ఆడలేక సతమతమై అనవసర సార్లు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. ఓపెనర్లు తర్వాత బరిలోకి వచ్చిన క్రిస్ గేల్ సైతం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. హార్డ్ హిట్టర్ గా పేరున్న క్రిస్ గేల్ ను నివారించడం కోసం హైదరాబాద్కు ప్రత్యేక ప్రణాళికలు వేస్తుకుంది. మొదటి ఓవర్ నే అభిషేక్ లాంటి స్పిన్నర్ కు ఇచ్చిన కెప్టెన్ వార్నర్ అదే ఊపుతో తర్వాత బౌలర్ లతో జాగ్రత్త లు చెప్పి, రన్స్ ఇవ్వకుండా కేవలం బాట్స్మన్ ను కట్టడి చేయడమే లక్ష్యంగా బంతులు వేశారు. దీంతో అసహనానికి లోనైనా పంజాబ్ బాట్స్మన్ అంత లేనిపోని షాట్లకు ప్రయత్నించి అవుట్ కావడం విశేషం. క్రిస్ గేల్ లో రషీద్ ఖాన్ ఔట్ చేసి పంపడంతో పాటు, తర్వాత వచ్చిన నికోలస్l పూరన్ వెంటనే రన్ అవుట్ అయ్యి వెనుదిరగడంతో పంజాబ్ కోలుకోలేకపోయింది. తర్వాత వచ్చిన ఎవరూ అంతగా ప్రభావం చూపలేదు. ఆరో వికెట్ గా వచ్చిన షారుక్ ఖాన్ మాత్రమే 22 రన్స్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ మొత్తంలో ఒకే ఒక సిక్స్ పడింది. అది కూడా 14వ ఓవర్లో 6 వ బ్యాట్స్మెన్గా వచ్చిన షారుఖ్ వేసిందే. మొత్తం మీద కేవలం 7 ఫోర్లు , ఒక సిక్స్ మాత్రమే పంజాబ్ ఇన్నింగ్స్ లో నమోదు అయ్యాయి అంటే కోరు వేగం ఎంత నెమ్మదిగా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్ బౌలర్లు ఎంత పటిష్టంగా పకడ్బందీగా బౌలింగ్ చేశారో కూడా తెలుస్తోంది. దీంతో పంజాబ్ 120 పరుగులు చేయగలిగింది.

121 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనర్లు కెప్టెన్ డేవిడ్ వార్నర్, బెయిర్స్టో లు మంచి శుభారంబం అందించారు. బెయిర్స్టో ధాటిగా ఆడి, కోర్టు ముందుకు తీసుకు వెళ్తే అతడికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ మంచి సహకారం అందిస్తూ వికెట్ నష్ట పోకుండా జాగ్రత్త పడ్డాడు. ఫేబియన్ బౌలింగ్ లో అనవసర శాఖకు ప్రయత్నించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. 37 బంతుల్లో 37 రన్స్ చేసిన వార్నర్ అవుట్ కావడంతో కెన్ విలియమ్స్ వికెట్ డౌన్ లో దిగి బాధ్యతాయుతంగా ఇన్నింగ్సును చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఓపెనర్ జానీ బెయిర్స్టో చివరి వరకు నిలిచి 63 రన్స్ సాధించి ఐపీఎల్లో హైదరాబాద్ కు మొదటి విజయాన్ని అందించాడు. కొడుకు కావడంతో చాలా నెమ్మదిగా ఆడిన హైదరాబాద్ టీం ఒక ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

సాయంత్రం మరో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది. వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ కు చెన్నై తో మ్యాచ్ చాలా కీలకం కానుంది. మరోపక్క ఇప్పుడిప్పుడే బ్యాట్స్మెన్లు బౌలర్లు సమిష్ఠిగా రాణిస్తున్న చెన్నై ఈసారి ఇదే ఊపుతో ముందుకు వెళ్లాలని ఆశిస్తోంది. దీంతో ఆ గంటలు మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగనుంది.

Show comments