iDreamPost
android-app
ios-app

చెన్నై చక్కటి ప్రణాళిక!

చెన్నై చక్కటి ప్రణాళిక!

ఈసారి ఐపీఎల్ చెన్నై కు బాగానే కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో ఉన్న చెన్నై ఓ ప్రణాళిక ప్రకారం ఆడుతూ విజయాలను నమోదు చేస్తోంది. సోమవారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెన్నై ను మొదట బ్యాటింగ్కు ఆహ్వానించాడు. చెన్నై బ్యాట్స్మెన్ అందరూ భారీ స్కోర్లు కొట్టకపోయినా క్రీజ్లో ఉన్నంత సేపు బ్యాట్ కు పని చెప్పడంతో నిర్ణీత ఓవర్లలో 188 పరుగులు భారీ స్కోరు చెన్నై చేసింది.

చెన్నై ఈ మ్యాచ్లో గెలిచినప్పటికీ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్గా బరిలోకి దిగుతున్న యువ ఆటగాడు ఋతురాజ్యువ ఆటగాడు ఋతురాజ్ గైక్వాడ్ షాట్ ఎంపికలో తడబడుతున్నాడు. గత ఐపీఎల్ లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఆటగాడికి చెన్నై ఇచ్చిన ఎన్నో అవకాశాలు వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఓపెనర్ గా వచ్చిన అవకాశాన్ని నిరూపించుకో లేక పోతున్నాడు. ఆల్ రౌండర్ కోటాలో చెన్నై లో చేరిన ఇంగ్లాండ్ స్పిన్నర్ వమొయిన్ అలీ సైతం బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణించడం చెన్నైకు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్లో సురేష్ రైనా రాకతో అంబటి రాయుడు మెరుపులు తోడు కావడం ప్లస్ అవుతోంది. అయితే కెప్టెన్ ధోనీ బ్యాట్ లో ఎక్కడో పస తగ్గటం సగటు సీఎస్కే అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ప్రతిసారి ధోనీ ఇన్నింగ్స్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అభిమానులకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. సోమవారం నాటి మ్యాచ్లో కూడా ధోనీ రెండు ఫోర్లు కొట్టి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించినా, వెంటనే అవుట్ కావడంతో మరోసారి చెన్నై అభిమానులకు ధోని మెరుపులు కనిపించలేదు. చివర్లో శ్యామ్ కరెన్స్ ధాటిగా ఆడటంతో చెన్నై కు మంచి స్కోరు లభించింది.

189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో ఎక్కడ ధాటిగా ఆడి నట్లు కనిపించలేదు. ఓపెనర్ బట్లర్ ఒక్కడే బౌండరీల మోత మోగించిన అతడికి కనీస సహకారం ఎవరి వద్ద నుంచి లభించలేదు. ఒకవైపు బట్లర్ ఆడుతున్న మరోవైపు వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లే అవుట్ కావడంతో రాజస్థాన్ ఏ దశలోనూ లక్ష్యం వైపు వెళ్తున్నట్లు అనిపించలేదు. బ్యాటింగ్లో అంతంతమాత్రంగానే ఉన్న రాజస్థాన్ కు అటు టాపార్డర్ లోనూ ఇటు మిడిలార్డర్ లోనూ సరైన బలం ఉన్నట్లు మాత్రం అనిపించడం లేదు. మొదటి మ్యాచ్లో సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్న కెప్టెన్ సంజు శాంసన్ మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడూ అవుతాడు అని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. బౌలింగ్లోనూ రవీంద్ర జడేజా వరుసగా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ పూర్తిగా చెన్నై వైపు టర్న్ అయ్యింది. మరోసారి కోలుకోలేని దెబ్బ కొట్టడం తో రాజస్థాన్ పూర్తిగా ఆగిపోయింది. దీంతో 45 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది.

మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ కు ముంబై ఇండియన్స్ కు మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇరు జట్లు రెండేసి మ్యాచ్ను గెలుచుకున్న తరుణంలో… ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న ముంబై ఈసారి ఢిల్లీ ను ఎలా ఓడిస్తుంది అన్నది, ముంబై పుంజుకుంటే దానిని కట్టడి చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు అని ఉన్న రికార్డు ఢిల్లీ చేస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. పాము లో ఉన్న ఢిల్లీ ఏం చేస్తుంది అన్నది మంగళవారం తెలుస్తుంది.