iDreamPost
android-app
ios-app

వీడియో: ఇస్రో చీఫ్‌కు ఘనస్వాగతం పలికిన ఇండిగో సిబ్బంది..

వీడియో: ఇస్రో చీఫ్‌కు ఘనస్వాగతం పలికిన ఇండిగో సిబ్బంది..

చంద్రయాన్-3..ప్రస్తుతం ఈ  పేరు చెప్పగానే ప్రతి ఒక్క భారతీయుడి ఒళ్లు పులకరిస్తుంది. కారణంగా ఇటీవలే చంద్రమండలం పైకి మన జెండాను  ఎగరెసిన రాకెట్. చంద్రయాన్-3 ల్యాండింగ్ తో మన శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై అడుగు పెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోయింది. ఈ సక్సెస్ ను 140 కోట్ల భారతీయులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ అపూర్వమైన విజయాన్ని అందించిన శాస్త్రవేత్తల కృషిని స్వదేశంతో పాటు విదేశాల్లోని ప్రముఖులు కొనియాడుతున్నారు. తాజాగా ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ కు ఇండిగో సంస్థ అపూర్వ స్వాగతం పలికింది. ఇస్రో ఛీప్ కు  సంబంధించిన  ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకెళ్తూ ఆగస్టు 23న చంద్రయాన్‌-3 జాబిల్లిని ముద్దాడింది. అభివృద్ధి  చెందిన దేశాలకు సాధ్యపడని దానిని.. మన శాస్త్రవేత్తలు సాధించారు శాస్త్రవేత్తల కృషికి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఇండిగో విమానం ఎక్కిన వీడియోను సిబ్బంది పంచుకోగా నెట్టింట వైరల్ గా మారింది. గురువారం సోమనాథ్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. దీంతో విమానం టేకాఫ్ కు ముందు సిబ్బంది ప్రత్యేకంగా గౌరవించారు. ఇండిగో సిబ్బంది ఆయనను గౌరవిస్తూ ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌ చేశారు.

“ఈ రోజు విమానంలో మనతో పాటు ప్రత్యేక వ్యక్తి కూడా ఉన్నారు. మీరు బోర్టులో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు సేవలందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. దేశం గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అనౌన్స్ మెంట్ చేశారు. అంతేకాక ఆయన లోపకి వస్తున్న సందర్భంలో ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌ హోస్టెస్‌ ఆయనకు ఫుడ్‌ ట్రేతో పాటు ఒక గ్రీటింగ్‌ కార్డును అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మరి.. ఈ అపూర్వ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Shah (@freebird_pooja)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş