iDreamPost
iDreamPost
Mithali Raj : ఇండియన్ విమెన్ క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ అంర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు సపోర్ట్ నిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు కూడా తనకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘‘ఇండియా జెర్సీ వేసుకుని దేశానికే ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా జర్నీలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. 23 ఏళ్లుగా ప్రతి సవాలును ఎదుర్కొన్నాను. జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చాను. ప్రతి సవాలు నుంచి అనుభవం గడించాను. ప్రతి ప్రయాణం లాగే, ఏదో ఒకరోజు ఇదికూడా ముగించాల్సిందే కదా అని అన్నారు.
నేను అంతర్జాతీయ క్రికెట్‌కు ఈరోజు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ, నా అత్యుత్తమ ప్రదర్శన చూపించి జట్టును గెలిపించాలని భావించేదానిని. ఆటకు వీడ్కోలు పలికే సమయం ఇప్పుడు వచ్చింది. ఎంతో మంది యువ క్రికెటర్లు రావాలి. భారత మహిళా క్రికెట్ భవిష్యత్తు గొప్పగా వెలిగిపోవాలంటూ మిథాలీ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.
Thank you for all your love & support over the years!
I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u— Mithali Raj (@M_Raj03) June 8, 2022
రిటైర్మెంట్ వేళ బిసిసిఐకి, కార్యదర్శి జై షాకు మిథాలీ థాంక్స్ చెప్పారు. క్రికెటర్‌గా తన ప్రయాణం ముగిసినా ఆటలో ఏదో విధంగా భాగస్వామ్యం అవుతాన్నారు. అంటే కోచింగ్ లోకి రావచ్చునని హింట్ ఇచ్చారు. అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వన్డేల్లో లెజెండ్ స్థాయికి వెళ్లన మిథాలీ, లాంగ్ ఇన్నింగ్స్ నిర్మించడంలో దిట్ట. 2019లో టీ20 క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. ఇప్పుడు వన్డే, టెస్టులకు కూడా గుడ్ బై చెప్పారు. 1999లో అరంగ్రేటం చేసిన నాటి నంచి 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించారు. భారత్ తరఫున 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడారు. కెప్టెన్ గా మంచి రికార్డులున్నాయి.
మిథాలీ రాజ్ క్రికెట్ జీవితంమీద ఓ బయోపిక్ మూవీ వస్తోంది. శభాష్ మిత్తు పేరుమీదుగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మిథాలీ రాజ్ పాత్రను తాప్సీ పోషిస్తోంది. మిథాలీ రిటైర్మెంట్ తో ఎమోషనల్ అయిన తాప్పీ, నువ్వు ఎప్పటికీ మా కెప్టెన్ అని ప్రశంసించింది. మిథాలీ సాధించిన విజయాలతో ఇన్ స్టా పోస్ట్ చేసింది.