గాల్వాన్, కార్గిల్ హీరోలకు ప్రత్యేక నివాళిగా, ఇండియన్ ఆర్మీ బైక్ ర్యాలీలు

అమర వీరులకు జై కొడుతూ తోటి సైనికుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఒక ర్యాలీ గాల్వన్ హీరోల కోసమైతే, మరొకటి కార్గిల్ వీరుల కోసం. ముందుగా నార్తన్ కమాండ్ సోల్జర్స్ (northern command soldiers) గాల్వన్ వ్యాలీలో ప్రాణాలు పోగొట్టుకున్న 20 మంది జవాన్ల కోసం, లడాఖ్ పర్వతాల్లో బైక్ ర్యాలీ చేశారు.

అమర వీరులకు జై కొడుతూ తోటి సైనికుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఒక ర్యాలీ గాల్వన్ హీరోల కోసమైతే, మరొకటి కార్గిల్ వీరుల కోసం. ముందుగా నార్తన్ కమాండ్ సోల్జర్స్ (northern command soldiers) గాల్వన్ వ్యాలీలో ప్రాణాలు పోగొట్టుకున్న 20 మంది జవాన్ల కోసం, లడాఖ్ పర్వతాల్లో బైక్ ర్యాలీ చేశారు.

గడ్డ కట్టించే చలిలో, పర్వత మార్గాల్లో తుపాకుల మోత మోగించిన జవాన్లు ఇప్పుడదే కఠిన వాతావరణంలో మోటార్ బైకులపై దూసుకుపోతున్నారు. అమర వీరులకు జై కొడుతూ తోటి సైనికుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఒక ర్యాలీ గాల్వన్ హీరోల కోసమైతే, మరొకటి కార్గిల్ వీరుల కోసం. ముందుగా నార్తన్ కమాండ్ సోల్జర్స్ (northern command soldiers) గాల్వన్ వ్యాలీలో ప్రాణాలు పోగొట్టుకున్న 20 మంది జవాన్ల కోసం, లడాఖ్ పర్వతాల్లో బైక్ ర్యాలీ చేశారు. లెహ్ సమీపంలోని కరు వద్ద ప్రారంభమైన ర్యాలీ షయాక్ నదీ తీరం వెంబడి అందమైన గ్రామాలను దాటుకుంటూ నుబ్రా లోయ చేరుకుంది.



2020 జూన్ లో గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన కాల్పుల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. వారి త్యాగాలను స్మరిస్తూ ఇండియన్ ఆర్మీ తూర్పు లడాఖ్ లోని 120వ పోస్టు వద్ద స్మారకాన్ని (memorial) నిర్మించింది. గత నెలలో కాశ్మీర్ లో పర్యటించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గాల్వన్ వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై విజయం సాధించి 23 ఏళ్ళు అయిన సందర్భంగా, “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” స్ఫూర్తితో ఇండియన్ ఆర్మీ ఢిల్లీ నుంచి లడాఖ్ లోని ద్రాస్ లో ఉన్న కార్గిల్ స్మారక స్థూపం వరకు మరో మోటర్ బైక్ యాత్ర చేస్తోంది. జూలై 18న ప్రారంభమైన ఈ యాత్ర హర్యానా, పంజాబ్, జమ్ము కాశ్మీర్ లోని లడాఖ్ మీదుగా సాగి 26న ద్రాస్ లో ముగుస్తుంది. రెండు జట్లుగా విడిపోయిన 30 మంది సైనిక వీరులు ఎత్తైన పర్వతాలు, కఠినమైన దారులు, మారుమూల ప్రాంతాల గుండా సాగిపోతున్నారు.

Show comments