iDreamPost
android-app
ios-app

ఐ యామ్ ఎ కాంప్లెన్ గర్ల్ యాడ్.. చిన్నారులు ఇప్పుడెలా ఉన్నారో చూడండి

  • Published Nov 03, 2023 | 4:27 PM Updated Updated Nov 03, 2023 | 4:27 PM

చిన్నప్పుడు యాడ్స్ కూడా వదలకుండా చూసేవారు. హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా గమ్మత్తుగా ఉండేది. ప్రకటనల్లో వచ్చే పాటలను కంఠస్త చేసి పాడుకునే వారు. ఆ మ్యూజిక్ హమ్మింగ్ చేసేవారు. సంతూర్ సంతూర్ అని, ఐ లవ్ యు రస్నా, వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ పాడుకునే వారు.. అటువంటి వాటిలో ఒకటి..

చిన్నప్పుడు యాడ్స్ కూడా వదలకుండా చూసేవారు. హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా గమ్మత్తుగా ఉండేది. ప్రకటనల్లో వచ్చే పాటలను కంఠస్త చేసి పాడుకునే వారు. ఆ మ్యూజిక్ హమ్మింగ్ చేసేవారు. సంతూర్ సంతూర్ అని, ఐ లవ్ యు రస్నా, వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ పాడుకునే వారు.. అటువంటి వాటిలో ఒకటి..

  • Published Nov 03, 2023 | 4:27 PMUpdated Nov 03, 2023 | 4:27 PM
ఐ యామ్ ఎ కాంప్లెన్ గర్ల్ యాడ్.. చిన్నారులు ఇప్పుడెలా ఉన్నారో చూడండి

ఒక ప్రొడక్ట్ మార్కెట్‌లో విడుదల చేసే ముందు, చేశాక.. అమ్ముడయ్యేందుకు ప్రకటనలు రూపొందిస్తుంటాయి ఆయా కంపెనీలు. వీటిని పలు టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేసేవి. అప్పట్లో ఆ యాడ్స్ ఎందుకు వస్తున్నాయో అర్థమయ్యేది కాదూ. ఇప్పుడయితే అవి కమర్షియల్ యాడ్స్ అని.. తమ స్వలాభల కోసమే వాటిని రూపొందిస్తున్నట్లు అర్థమౌతుంది. అలాగే నేరుగా తెలుగు యాడ్స్ వస్తున్నాయి. కానీ గతంలో హిందీ యాడ్స్ లేదా ఇంగ్లీష్ ప్రకటనలను..తెలుగులో డబ్ చేసేవారు. ప్రకటనల్లో వాడే పదాలు కూడా వింతగా తోచేవి. అలా చాలా వరకు బాలీవుడ్ నటీనటులే కనిపించేవారు. ఆ యాడ్స్ కూడా చూడగా, చూడగా కంఠస్తం వచ్చేసేవి. సరదాగా వాటిల్లో పాటలు కూడా పాడేవారు.

అలాంటి పాటల్లో వాషింగ్ పౌడర్ నిర్మా.. ఐ లవ్ యూ రస్నా, బూంబూం బూమర్, ఇల్లంతా మిల మిల మెరవాలంటే.. నోరోలాక్స్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది, వికో టర్మరీ కాదు కాస్మటిక్, ఊ లాలాలా అంటూ లిరిల్ యాడ్, సంతూర్ సంతూర్, హమారా బజాజ్, నాలుగు చుక్కలు అండీ ఆహా(ఉజాలా), ఒకటే శారీడన్ ఇక ఉండదు తలనొప్పి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అటువంటి వాటిల్లో మరొకటి ‘నేను ఎదుగుతున్నాగా మమ్మీ’ అంటూ కాంప్లెన్ యాడ్ వస్తూ ఉండేది. ఐ యామ్ కాంప్లన్ గర్ల్, కాంప్లన్ బాయ్ అందులో ఇద్దరు చిన్నారులు నటించారు. ఈ ఫోటోలో పిక్ ఆ యాడ్ లోనిదే. ఆ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో తెలుసా.

చిన్నప్పుడు ఆ యాడ్స్ లో అలరించిన ఈ కిడ్స్ ఇప్పుడు స్టార్స్ అయ్యారు. ఆ ఇద్దరు బాలీవుడ్ నటులు షాహీద్ కపూర్, అయేషా టకియా. షాహీద్ కపూర్ ఇంకా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే అయేషా టకియా మాత్రం ఇప్పుడు మూవీస్ చేయడం లేదు. బాలీవుడ్ సినిమాలు చూసే వారికి షాహీద్ సుపరిచితమే. పలు యాడ్స్ ద్వారా కూడా తెలుగు వారికి దగ్గరయ్యాడు. కబీర్ సింగ్, జెర్సీ తెలుగు సినిమా రీమేక్స్‌లో హీరోగా నటించి మరింత చేరువయ్యాడు టాలీవుడ్ ప్రేక్షకులకు. ప్రస్తుతం రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. ఇక అయేషా టకియా.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ చిత్రంలో నాగార్జునకు జోడిగా కనిపించింది. హిందీలో పలు సినిమాల్లో కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Entertainment Say (@entertainmentsay)

 

View this post on Instagram

 

A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş