iDreamPost
android-app
ios-app

హుజూరాబాద్ : ప్ర‌చార హోరు.. ఎవ‌రో బేజారు!

  • Published Oct 11, 2021 | 1:47 AM Updated Updated Mar 11, 2022 | 10:38 PM
  • Published Oct 11, 2021 | 1:47 AMUpdated Mar 11, 2022 | 10:38 PM
హుజూరాబాద్ : ప్ర‌చార హోరు.. ఎవ‌రో బేజారు!

రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక ఖాయమని భావించిన.. అన్ని పార్టీలు రాజకీయ అస్త్రాలను సిద్ధంగా పెట్టుకున్నాయి. ఈటల రాజీనామా చేసిన వెంటనే ప్రచారానికి ఉపక్రమించాయి. నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యాక జోరు పెంచాయి. నామినేష‌న్ల ప‌ర్వం ముగిశాక మ‌రింత దూకుడుగా సాగుతున్నాయి. మిగ‌తా పార్టీల సంగ‌తి ఎలాగున్నా.. ప్రధాన పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే చివ‌రి వ‌చ్చేస‌రికి ఎవ‌రు బేజార‌వుతారో, ఎవ‌రు హుషార‌వుతారో చూడాలి.

టీఆర్ఎస్ కుల సమీకరణలను అంచనా వేసి గెల్లు శ్రీనివాస్ ను బరిలోకి దింపింది. రెండు నెలలుగా ముగ్గురు మంత్రులు హుజురాబాద్లో మకాం వేశారు. నియోజకవర్గంలో హామీలు గుప్పించారు. కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం మొదలు.. బండా శ్రీ‌నివాసుని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం… వకుళాభరణం రామకృష్ణను బీసీ కమిషన్ చైర్మన్గా ఎంపిక చేయడం ఆ పరిణామాలన్నీ రోజుల వ్యవధిలోనే జరిగాయి. అనేక హామీలు కులాల వారిగా ఓట్లను టీఆర్ఎస్ సమీకరిస్తోంది. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ గ్రామగ్రామాన సభలు సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు మంత్రి హరీశ్రావు తనదైన శైలిలో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

ఈటల తన ప్రచారాన్ని పాదయాత్రతో మొదలుపెట్టారు. అనివార్య కారణాలతో పాదయాత్రను విరమించుకున్నా.. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రచారంలో ఈటల మార్కును చూపిస్తున్నారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ ను, మంత్రి హ‌రీశ్ రావును, టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఓటుకు ఏకంగా 20 వేల నుంచి, 50 వేల వ‌ర‌కూ ఇచ్చేందుకు వెనుకాడ‌డం లేదంటూ టీఆర్ఎస్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో వైపు ప్ర‌చారంలో దూకుడు పెంచేందుకుబీజేపీ స్టార్ క్యాపైనర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో 20 మంది నేతలకు చోటు కల్పించారు.

కాంగ్రెస్ అనేక కసరత్తులు చేసిన తర్వాత ఆలస్యంగా అభ్యర్థి బల్మూరి వెంకట్ ను ఎంపిక చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నికను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం మండలాల వారిగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయంగా ఎన్నడూ లేనంత హీట్ను పుట్టిస్తున్నాయి. 2023లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిహార్సల్స్గా ఉప ఎన్నికను అన్ని పార్టీలు భావిస్తున్నాయి. హుజురాబాద్లో ఓటర్లు ఎవరిని బాద్షా చేస్తోరా చూడాలి.

రాజకీయాల్లో ఆధిపత్య పోరు సహజం. రాజకీయ చతురత ప్రదర్శించి ఆధిపత్యపోరులో పై చేయి సాధించడమే రాజకీయ ముఖ్య లక్ష్యం. సమయస్పూర్తితో పాటు సకాలంలో అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం.. దాన్ని సాధించుకోవడంలో ప్రత్యర్థిని రాజకీయంగా ఇరుకున పెట్టడం తప్పనిసరి వ్యూహంగా ఉంటుంది. ఇక రాజకీయ పార్టీలు ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేస్తుంటారు. హుజూరాబాద్ లో కూడా అదే జ‌రుగుతోంది. అయితే చివ‌రి వ‌చ్చేస‌రికి ఎవ‌రు బేజార‌వుతారో, ఎవ‌రు హుషార‌వుతారో చూడాలి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet