భార్యకు గుడి కట్టి పూజిస్తున్న భర్త! ఈ తరానికి తెలియని నిజమైన ప్రేమ!

ఈ రోజుల్లో వివాహాలు కమర్షియల్ అయ్యాయి. మూడు ముళ్లు పడగానే.. భార్యపై భర్త పెత్తనం చేయాలనుకుంటాడు. అలాగే భర్త సంపాదన తన చేతిలోనే పెట్టాలనుకుంటుంది భార్య. దీంతో కాంప్రమైజ్ అనే మాటను మర్చిపోయారు. ఏదైనా తేడా జరిగిందంటే విడాకులే..

ఈ రోజుల్లో వివాహాలు కమర్షియల్ అయ్యాయి. మూడు ముళ్లు పడగానే.. భార్యపై భర్త పెత్తనం చేయాలనుకుంటాడు. అలాగే భర్త సంపాదన తన చేతిలోనే పెట్టాలనుకుంటుంది భార్య. దీంతో కాంప్రమైజ్ అనే మాటను మర్చిపోయారు. ఏదైనా తేడా జరిగిందంటే విడాకులే..

ఈ రోజుల్లో మూడు ముళ్లు పడిన రోజే విడాకులకు వెళుతున్నారు దంపతులు. కాపురాన్ని మూడు నాళ్ల ముచ్చటగా మార్చేసుకుంటున్నారు. అలకలు, గొడవలు మొదలయ్యి.. ఒకరిపై ఒకరు నిత్యం తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దూషించుకుంటూ సంసారాన్ని రణ రంగం, యుద్దకాండలా మార్చేసుకుంటున్నారు. భర్త మాట అంటే భార్యకు పడటం లేదు. అలాగే పత్ని కసురుకుంటూ వెంటనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు పతి. దీంతో నీతో కలిసి ఉండేది ఏంటీ అంటూ ఎవరి  దారి  వారు వెతుక్కుంటున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం హద్దులు మీరి ఒకరి అవసరం మరొకరికి లేకుండా పోతుంది. ఇలాంటి కాలంలో ఓ వ్యక్తి తనను వదిలేసి వెళ్లిపోయిన భార్యకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నాడు.

భార్య లేకపోతే.. భార్య ప్రతిరూపాన్ని ప్రతిష్టించాలని అనుకున్నాడు. భార్య మరణించినా.. నిత్యం తన కన్నుల ముందే ఆమె ఉండాలని భావించాడు. ఈ క్రమంలోనే.. ఆమె గుర్తుగా పొలం వద్ద గుడి కట్టించారు. అందులో తన భార్య ప్రతిరూపాన్ని ప్రతిష్టించి.. నిత్యం పూజలు చేస్తున్నాడు. బతికి ఉన్నప్పుడు తనకు చేసిన సేవలకు గానూ.. ఇప్పుడు ఆమె ప్రతిరూపాన్ని కొలుస్తున్నాడు. ఆమెకు నిత్యం పూజలు చేసి, పూలు, పళ్లు అందించి.. ఓ దేవతలా పూజిస్తున్నాడు.  ప్రతి క్షణం గొడవ పడే భార్యా భర్తలకు.. నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచాడు ఈ భర్త.
Show comments