Idream media
Idream media
కండీల్ బలోచ్, ఈ పేరు పాకిస్తాన్‌లో అందరికీ తెలుసు. ఆమె అక్కడ పెద్ద సోషల్ మీడియా స్టార్. ఆమె పాపులారిటీని భరించలేక సొంత అన్నయ్యే హత్య చేశాడు. దీని వెనుక మత నాయకుడి హస్తం కూడా ఉంది. పాకిస్తాన్ మహిళల హక్కుల విషయంలో ఇంకా ఎదగలేదు. అక్కడి చట్టాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, పరువు హత్య కేసులో నిందితుడికి , అతని కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే అతన్ని నిర్దోషిగా వదిలేస్తారు. కండీల్ అన్న వాసిమ్‌ని , ఆమె తల్లిదండ్రులు క్షమిస్తే కేసు ఉండదు. అయితే ఆమె తండ్రి, తన కొడుక్కి మరణ శిక్ష పడాలని కోరుకుంటున్నాడు.
అసలు ఎవరీ కండీల్?
1990లో ఒక మారుమూల పల్లెలో , అత్యంత పేదరికంలో పుట్టింది. చిన్నవయస్సులోనే పెళ్లి చేశారు. ఒక బిడ్డ పుట్టాడు. కానీ భర్త హింసని భరించలేక కరాచీకి పారిపోయింది.
టీవీ షో ఆడిషన్‌లో పాల్గొనడంతో లైఫ్ మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి స్టార్‌గా మారిపోయింది. సెక్సీ ఫోజులతో డ్యాన్స్‌లు చేసి యువతని పిచ్చెక్కించింది. ఆమె అసలు పేరు ఎవరికీ తెలయకపోవడంతో, 2013-2016 వరకు ఆమె కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
అయితే ఒక రిపోర్టర్ అతి ఉత్సాహంతో ఆమె పాస్‌పోర్ట్ వివరాలు ప్రచురించాడు. దాంతో మీడియా ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌ని గుచ్చిగుచ్చి ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఆమె అన్నయ్యకి ఇది నచ్చలేదు.
ముఫ్రీ కవి అనే మత పెద్దతో ఆమె సన్నిహితంగా ఉండే వీడియో లీక్ అయ్యేసరికి దుమారం లేచింది. అతని సహకారంతోనే కండీల్ పరువు హత్యకి గురైందని ఆరోపణ. 2016లో కండీల్ గొంతు పిసికి హత్య చేశాడు. కేసు ఇంకా నడుస్తోంది.
పేదరికంతో పోరాడి గెలవాలని కోరుకున్న కండీల్ , కుటుంబం చేతిలోనే చనిపోయింది. సనంమహెర్ అనే మహిళా జర్నలిస్ట్ The Life And Death Of QUANDEEL BALOCH అనే పుస్తకం రాశారు. అది సెన్సేషనల్‌గా అమ్ముడుపోతోంది.