శ్రీకాళహస్తి గుడికి సాయి తేజ్‌.. వివాదంగా మారిన ‘హారతి’కార్యక్రమం!

హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తి దర్శనం సందర్భంగా ఆయన దేవుడికి హారతి ఇవ్వటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాయి తేజ్‌ నిన్న శ్రీకాళహస్తికి వెళ్లారు. అక్కడ స్వామి వారిని దర్శించుకోవటంతో పాటు.. రాహుకేతు పూజలు కూడా చేయించారు. స్వామివారిని దర్శించుకునే సమయంలో సాయి తేజ్‌ ఉపాలయంలోని చంగల్ రాయ స్వామి (సుబ్రమణ్యేశ్వర స్వామి) దగ్గరకు వచ్చాడు. దీంతో అక్కడున్న సిబ్బంది సాయితేజ్ చేతికి హారతి పల్లెం ఇచ్చారు. ఆయన చేతుల మీదుగా చంగల్‌ రాయ స్వామికి హారతి ఇప్పించారు.

ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఆలయ నిబంధనల్ని.. ఆచారాల్ని అధికారులు, అర్చకులు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు! శ్రీకాళహస్తి దేవాలయ సంప్రదాయం ‍ప్రకారం.. కేవలం అర్చకులు మాత్రమే పూజలు చేసి హారతులు ఇవ్వాలని, సామాన్య జనం హారతి ఇవ్వడం నిషిద్దమని కొంతమంది అర్చకులు అంటున్నారు. మరో వైపు శ్రీకాళహస్తిలో ఇలాంటి సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయని స్థానిక జనం చెబుతున్నారు.

గతంలో సింగర్ మంగ్లీ ఈ ఆలయంలో ఓ పాటను షూట్ చేయటానికి ఆమెకు అధికారులు అన్ని రకాల అనుమతులిచ్చారంటున్నారు. దానితో పోల్చుకుంటే సాయి ధరమ్‌ తేజ్‌ హారతి ఇవ్వటం పెద్ద విషయం ఏమీ కాదంటున్నారు. అయితే, ఇలాంటి ఘటనలపై భక్తులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆలయ అధికారులు, అర్చకుల అత్యుత్సాహం కారణంగా ఆలయ ప్రతిష్ట మసకబారుతోందని మండిపడుతున్నారు. మరి, శ్రీకాశహస్తి దేవాలయంలో హారతి ఇచ్చి సాయి ధరమ్‌ తేజ్‌ వివాదంలో చిక్కుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments