iDreamPost
android-app
ios-app

Miss Universe 2021 : 21 ఏళ్ళ నిరీక్షణకు బ్రేకులేసిన పంజాబీ భామ.. మిస్ యూనివర్స్ 2021గా అవతరణ

Miss Universe 2021 : 21 ఏళ్ళ నిరీక్షణకు బ్రేకులేసిన పంజాబీ భామ.. మిస్ యూనివర్స్ 2021గా అవతరణ

భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021 టైటిల్ సహా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. హర్నాజ్ సంధు 21 ఏళ్ల వయసులో ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. హర్నాజ్ సంధు పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వారు. దాదాపు 21 ఏళ్ల నుంచి ఉన్న ఎదురుచూపులకు బ్రేకులు వేస్తూ హర్నాజ్ సంధు ఈ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా యావత్ దేశాన్ని గర్వపడేలా చేశారు. 70వ మిస్ యూనివర్స్ పోటీ ఈ ఏడాది డిసెంబర్ 12న ఇజ్రాయెల్‌లో జరిగింది. ఈ పోటీలో 80 దేశాల నుండి మోడల్స్ పాల్గొన్నారు. కానీ టైటిల్ హర్నాజ్ సంధునే వరించింది.

21 ఏళ్ల తర్వాత కిరీటం భారత్‌కు తిరిగి వచ్చింది

హర్నాజ్ సంధు కంటే ముందు, లారా దత్తా 2000 సంవత్సరంలో భారతదేశం నుండి మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. సంధు కంటే ముందు ఇద్దరు భారతీయులు మాత్రమే మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. నటి సుస్మితాసేన్ 1994లో మరియు లారా దత్తా 2000లో ఈ టైటిల్ గెలుచుకోగా ఇప్పుడు హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన మూడవ భారతీయురాలుగా నిలిచింది.

అసలు ఎవరీ హర్నాజ్ సంధు?

హర్నాజ్ సంధు స్వస్థలం పంజాబ్‌లోని చండీగఢ్. హర్నాజ్ వృత్తిరీత్యా మోడల్ కాగా ఆ పని చేస్తూనే ఆమె పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో MA చదువుతోంది. హెర్నాజ్ గత ఏడాది మిస్ యూనివర్స్ మెక్సికోగా ఆండ్రియా మెజా కిరీటాన్ని కూడా కైవసం చేసుకుంది. ఆ పోటీలో పరాగ్వేకు చెందిన 22 ఏళ్ల నాడియా ఫెరీరా రెండో స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికాకు చెందిన 24 ఏళ్ల లాలెలా మస్వానే మూడో స్థానంలో నిలిచింది.

పంజాబీ సినిమాల్లో?

హర్నాజ్ సంధు 17 సంవత్సరాల వయస్సులో చండీగఢ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 2017 సంవత్సరంలో టైమ్స్ ఫ్రెష్ ఫేస్‌ని గెలుచుకున్నారు. తర్వాత ఆమె LIVA మిస్ దివా యూనివర్స్ 2021 టైటిల్‌ను సైతం గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే హర్నాజ్ సంధు ‘యారా దియాన్ పౌ బరన్’ మరియు ‘బైజీ కుట్టంగే’ వంటి పంజాబీ సినిమాలకు కూడా పని చేసింది.

ఇక మిస్ యూనివర్స్ 2021 పోటీకి న్యాయనిర్ణేతలలో ఒకరిగా ఊర్వశి రౌతేలా కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కూడా హర్నాజ్ సంధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హర్నాజ్ మిస్ యూనివర్స్ అయిన తర్వాత, మీరు భారత దేశాన్ని గర్వించేలా చేశారు, మీ విజయం మొత్తం దేశం యొక్క విజయం అని ఆమెకు ప్రశంశలు కురుస్తున్నాయి. హర్నాజ్ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్నారు.

Also Read : Pushpa : పాన్ ఇండియా సినిమాను ఇలా వదిలేస్తారా

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş