Fame India Scheme: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్

దేశ ప్రజల సౌకర్యాల కోసం ప్రభుత్వం తన వంతు బాధ్యత ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే సర్కారు వారు రకరకాల స్కీంలను ప్రజల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వం మహిళల కోసం కొత్త కొత్త పథకాలను అమలు లోకి తీసుకుని వస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా మోడీ సర్కారు ఈ కొత్త సంవత్సరంలో మహిళలకు మరో గుడ్ న్యూస్ ను చెప్పనుంది.

దేశ ప్రజల సౌకర్యాల కోసం ప్రభుత్వం తన వంతు బాధ్యత ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే సర్కారు వారు రకరకాల స్కీంలను ప్రజల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వం మహిళల కోసం కొత్త కొత్త పథకాలను అమలు లోకి తీసుకుని వస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా మోడీ సర్కారు ఈ కొత్త సంవత్సరంలో మహిళలకు మరో గుడ్ న్యూస్ ను చెప్పనుంది.

ఇప్పటికే దేశంలో ఫేమ్ ఇండియా పథకం తొలి దశ 2015-17 మధ్యలో అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ పథకం యొక్క రెండవ దశ కొనసాగుతూనే ఉంది . ఈ క్రమంలో మోడీ సర్కార్ దీనికి సంబంధించి మహిళలకు మరో శుభవార్తను అందించనుంది. పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఫేమ్ స్కీంను.. పొడిగించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ఫేమ్ 3 ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం.

కాగా, ఈసారి అమలులోకి రాబోయే ఫేమ్ 3 స్కీంలో.. ఎలక్ట్రిక్ టూవీలర్ల కొనుగోలుపై రూ.8.158 కోట్లు, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై రూ.9,600 కోట్లు , ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ కొనుగోలపై రూ 4,100 కోట్లను సబ్సిడీ రూపంలో ఇచ్చే దిశగా.. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లకు సంబంధించి రూ.1800 కోట్లు, పైగా మొదటి సారి ఈ-ట్రాక్టర్లను, హైబ్రిడ్‌ వాహనాలను కూడా ఈ స్కీంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పైగా ప్రత్యేకంగా దీనికోసం రూ.300 కోట్లను కేటాయించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ఫేమ్ 3 స్కీంకు మొత్తంగా రూ. 26,400 కోట్లు కేటాయించాల్సి వస్తుందని కేంద్రం భావిస్తున్నట్లుగా సమాచారం.అంతే కాకుండా కొత్తగా అమలు చేయబోయే ఫేమ్ 3 స్కీంలో.. ప్రత్యేకించి మహిళలకు ఇందులో రాయితీ అందించనుంది. మహిళల పేరుతో రిజిస్టర్ చేసిన వాహనాలకు పది శాతం అదనపు సబ్సిడీ అందించే దిశగా.. ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఒకవేళ ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ ఫేమ్ 3 స్కీం కనుక అమలులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి.. కాస్త ఊరట కలుగుతుందని చెప్పి తీరాలి. ఇప్పటికే కొనసాగుతున్న ఫేమ్ 2 స్కీం.. ఈ ఏడాది మార్చి 31తో ముగుస్తుంది. అయితే ఇప్పటికే రెండు దశలుగా అమలు పరిచిన ఈ స్కీంకు.. మూడవ దశను కూడా కకొనసాగించడం అవసరమా అనే ప్రశ్నను ఆర్థిక శాఖ సందించగా.. ప్రజలను పర్యావరణ పరిరక్షణ దిశగా తీసుకు వెళ్లేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని.. అందుకోసమే కేంద్రం ఈ విషయంలో ఇంత ఖచ్చితంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, మోడీ సర్కారు ఫేమ్ 3 స్కీంను అమలులోకి తీసురావాలనే ఆలోచన ఎంతో విలువైనది. దీని ద్వారా ఎంతో మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. మరి, ఈ ఫేమ్ 3 స్కీం విషయంలో మీ అభిప్రాయాలను.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments