విద్యార్థులకు శుభవార్త.. రూ.1.5 లక్షల స్కాలర్‌షిప్‌ పొందే ఛాన్స్‌.. పూర్తి వివరాలు..

దేశంలో ఎంతో మంది విద్యార్థులు చదువుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే, వారిలో చాలా మందికి ఆర్థిక స్థోమత సరిగా లేని కారణంగా ఆ చదువు మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుంది. అటువంటి వారికి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

దేశంలో ఎంతో మంది విద్యార్థులు చదువుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే, వారిలో చాలా మందికి ఆర్థిక స్థోమత సరిగా లేని కారణంగా ఆ చదువు మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుంది. అటువంటి వారికి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రతి ఒక్కరికి విద్య అనేది ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ విధంగా ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రస్తుతం .. అక్షరాస్యత శాతం పెరుగుతూనే ఉంది. కానీ, ఇంకా కొంతమంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి చదువును కొనసాగించలేకపోతున్నారు. అటువంటి వారి కోసం తాజాగా ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అందించబోతుంది. ఈ క్రమంలో బలహీన వర్గాల విద్యార్థుల కోసం.. భారత ప్రభుతం కొత్త స్కీం ను స్కాలర్ షిప్ రూపంలో అందించబోతుంది. దాని పేరే పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా(YASASVI). దీనినే “పీఎం యశస్వీ స్కాలర్ షిప్ స్కీమ్” అని కూడా అంటారు. అయితే , ఈ స్కాలర్ షిప్ ను పొందడానికి ఎటువంటి అర్హత ఉండాలి, ఈ స్కాలర్ షిప్ ను ఎలా అప్లై చేసుకోవాలి , అసలు ప్రభుత్వం ఈ స్కీం ద్వారా ఎంత మొత్తం అమౌంట్ ను విద్యార్థులకు అందచేస్తుంది .. అనే వివరాలు తెలుసుకుందాం.

అయితే, ఈ స్కీం కు అర్హత గల విద్యార్థులు 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు మాత్రమే. కాగా, వీరిలో 9,10 వ తరగతి చదివే విద్యార్థులకు ప్రతి ఏటా రూ.75 వేలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతి ఏటా రూ.1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈ స్కాలర్ షిప్ స్కీం ద్వారా ప్రభుత్వం అందించనుంది. అయితే, 2023 సంవత్సరంలో మెరిట్ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేశారు. కాగా, ఈ అర్హతను సాదించాలి అంటే .. దానికి ముందు ఎంట్రీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలి. కాబట్టి దానికి సంబంధించన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే..ఈ https://yet.nta.ac.in/ NTA వెబ్ సైట్ ను విసిట్ చేయాలి. ఇక ఈ స్కాలర్ షిప్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు అనే విషయాలు చూద్దాం.

పీఎం యశస్వీ స్కాలర్ షిప్ స్కీమ్ కు .. పీఆర్థికంగా వెనుకబడిన తరగతలు, సంచార, పాక్షిక-సంచార జాతులు,డీనోటిఫైడ్ తెగలకు చెందిన 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు.. అర్హులైన విద్యార్థులు పొందవచ్చు. కాగా, దీనికోసం వారి ఇందుకు కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి. ఇక ఈ స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంకు అకౌంట్ కు ట్రాన్ఫర్ చేయబడుతుందని .. అధికారులు పేర్కొన్నారు. దీనిని ఎలా అప్లై చేసుకోవాలంటే.. ముందుగా Social justice and empowerment వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తర్వాత అక్కడ కనిపించే PM యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ పేజీలో సూచించబడిన విధంగా .. అర్హుల వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ఒక మెసేజ్ ద్వారా ఫోన్ కు రిజిస్ట్రేషన్ నంబర్,పాస్‌వర్డ్ వస్తుంది. దాని ద్వారా పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫార్మ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి, ఆర్ధికంగా వెనుక బడిన విద్యార్థుల కోసం .. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments