iDreamPost
android-app
ios-app

సినిమా లవర్స్ కి శుభవార్త – కానీ

  • Published Aug 17, 2020 | 10:23 AM Updated Updated Aug 17, 2020 | 10:23 AM
సినిమా లవర్స్ కి శుభవార్త – కానీ

ఇక లాభం లేదనుకుని కరోనాను సహజీవనంలో భాగం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తాజాగా లీకవుతున్న అప్డేట్స్ ని బట్టి తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే కొత్త మార్గదర్శకాల్లో సెప్టెంబర్ నుంచి మాల్స్, థియేటర్స్, స్కూల్స్ తో సహా అన్ని తెరుచుకునేలా అనుమతి ఇస్తారట. అయితే తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలనే క్లాజ్ అందులో పొందుపరుస్తారట. సో మొత్తానికి సినిమా హాళ్లు తెరుచుకునే రోజులు దగ్గరలో ఉన్నాయన్న మాట. అయితే ఇది వినగానే సంబరపడే వార్త కాదు. ఎందుకంటే కొత్త రిలీజులు ముందు ఎవరు చేస్తారో తెలియదు.  అసలు జనం వస్తారా రారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఏ నిర్మాతా రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేడు.

ఈ నేపథ్యంలో థియేటర్లను తెరిచినా ప్రస్తుతానికి పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే జనాన్ని అలవాటు చేయడానికి కొంత కాలం పాత సినిమాలు వేసుకుని లాభనష్టాలు లెక్క వేసుకోకుండా నడపాల్సి ఉంటుంది. ఇది కూడా దేశమంతా ఒకేసారి థియేటర్లు తెరుచుకుంటేనే వర్కవుట్ అవుతుంది తప్ప ఒక చోట తెరిచి మరోచోట మూయడం వల్ల ఒరిగేదేమి ఉండదు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఈ నెల మూడో వారంలో రావొచ్చు. కరోనా తీవ్రత అయితే పూర్తిగా కంట్రోల్ లోకి రాలేదు. విజృంభణ కొనసాగుతోంది. ఎక్కడిక్కడ ప్రాణాలు పోతూనే ఉన్నాయి. పబ్లిక్ బయట తిరగడం మానడం లేదు.ఇప్పుడు థియేటర్లకు మినహాయింపు ఇచ్చి తెరిచినా పూర్తిగా ప్రేక్షకులు రారని కాదు. వస్తారు. కాకపోతే హౌస్ ఫుల్ అయ్యేంత సీన్ ఉండదు.

రూల్స్ కూడా ఒప్పుకోవు. కానీ నాని వికి ఓ కొత్త తరహా ఒప్పందం చేసుకున్నారట. డైరెక్ట్ ఓటిటి రిలీజే అయినప్పటికీ తర్వాత ఓ వారం రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించేలా అగ్రిమెంట్ లో పొందుపరిచారట. ఒకవేళ డిజిటల్ ప్రీమియర్ టైంలోనే థియేటర్లు కనుక నడుస్తూ ఉంటే రెండు మాధ్యమాల్లోనూ ఒకేసారి విడుదలై ఇలా వచ్చిన మొదటి సినిమాగా వి చరిత్ర సృష్టించవచ్చు. అయితే ఇదంతా లీకైన న్యూసుల సారాంశమే కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు థియేటర్లకు అనుమతులు ఇచ్చినా ఓక ప్రేక్షకుడు రెండు టికెట్లు కొని ఒక సీట్లోనే కూర్చునే ప్రతిపాదన ఉందట. కానీ ప్రాక్టికల్ గా ఇలాంటివి అంత తేలికగా వర్కవుట్ అయ్యేవి కాదు. కనీసం ఇంకో రెండు నెలలు గడిస్తే కానీ కొంతలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. సో సెప్టెంబర్ ఓపెనింగ్ వార్త వినడానికి బాగానే ఉన్న క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను చూసుకుంటే మూవీ లవర్స్ ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetMadridbet