iDreamPost
android-app
ios-app

గ్యాంగ్‌స్టర్ గంగరాజు రివ్యూ

  • Published Jun 25, 2022 | 12:40 PM Updated Updated Jun 25, 2022 | 12:40 PM
గ్యాంగ్‌స్టర్ గంగరాజు రివ్యూ

ఈ శుక్రవారం టికెట్ కౌంటర్ల మీద దాడి చేసిన సినిమాల్లో గ్యాంగ్ స్టర్ గంగరాజు కూడా ఉంది. అందరి దృష్టి కాస్తో కూస్తో సమ్మతమే , చోర్ బజార్ ల మీద ఉండటంతో ఈ మూవీని పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. అందుకే ఓపెనింగ్స్ మరీ నీరసంగా మొదలయ్యాయి. అయితే ట్రైలర్ చూశాక ఇందులో కమర్షియల్ అంశాలు గట్టిగానే ఉన్నాయనే అభిప్రాయం ఏర్పడటంతో కొద్దిపాటి జనం థియేటర్లకు వెళ్లారు. ఒకప్పుడు పెద్ద చిత్రాలు నిర్మించి ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న చదలవాడ ఫ్యామిలీ నుంచి వచ్చిన లక్ష్య్ హీరోగా రూపొందిన మూవీ ఇది. మరి నో హైప్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

దేవరలంకలో ఉండే గంగరాజు(లక్ష్య్)ఓ ఆవారా గ్యాంగ్ ని వెంటేసుకుని తిరుగుతూ పనీపాటా లేకుండా ఉంటాడు. తండ్రి(గోపరాజు రమణ) రైల్వే ఉద్యోగి అయినప్పటికీ ఇతనిలో ఎలాంటి మార్పు రాదు. ఆ ప్రాంతానికి ఎస్ఐగా వచ్చిన ఉమాదేవి(వేదికా దత్తా)ను చూడగానే మనసు పడి ప్రేమించేస్తాడు. ఆమె ఒప్పుకోకపోయినా రకరకాల ఫీట్లు చేస్తుంటాడు. ఓ రోజు అనూహ్యంగా పేరు మోసిన గ్యాంగ్ స్టర్ సిద్ధప్పని హత్య చేయడంతో గంగరాజు పేరు మారుమ్రోగిపోతుంది. అసలు అతనా మర్డర్ ఎందుకు చేశాడు, ఇంత జులాయిగా ఉండటానికి కారణం ఏంటి, లవ్ స్టోరీ చివరికి ఏమైంది, అసలు శత్రువులు ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.

ఇప్పుడు మంచు విష్ణుతో జిన్నా తీస్తున్న ఈశాన్ సూర్య ఈ సినిమాకు దర్శకుడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్లిపోయాడు. ప్రత్యేకంగా చెప్పుకునే అంశాలు పెద్దగా లేవు. కాకపోతే కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఇంటర్వెల్ నుంచి క్లిక్ అవ్వడం మరీ బ్యాడ్ అవ్వకుండా కాపాడింది. అయితే కామన్ ఆడియన్స్ కి మాత్రం ఇదంతా రొటీన్ వ్యవహారంగా తోస్తుంది. ఒకరిద్దరు తప్పించి అధిక శాతం కొత్త క్యాస్టింగ్ ఉండటం గంగరాజుకున్న ప్రధాన మైనస్. యాక్టింగ్ పరంగా ఎంత కష్టపడినప్పటికీ లక్ష్య్ వయసుకు అతని జీరో ఇమేజ్ కి మించిన పాత్ర ఇది. అయినా బాగానే చేసుకుంటూ వచ్చాడు. సాయి కార్తీక్ సంగీతం పర్లేదు. బడ్జెట్ బాగానే ఖర్చు పెట్టారు. ఒక్క ఇంచు కొత్తదనం ఆశించకుండా థియేటర్ కు వెళ్తే ఓకే కానీ ఏదేదో ఊహించుకుంటే మాత్రం గ్యాంగ్ స్టర్ గంగరాజు నిరాశ పరుస్తాడు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet