iDreamPost
iDreamPost
వినాయచ చవితి అంటేనే అటు ఆధ్యాత్మిక, ఇటు క్రియేటివిటీని రంగరించే పండుగ. నవరాత్రోత్సవాలు జరిపేందుకు ప్రతిఊరిలోనూ, టౌన్స్ లో అయితే కూడళ్లలోనూ, చివరకు వీధుల్లోనూ మండపాలు కళకళ్లాడుతున్నాయి. ప్రతిచోటా గణనాథుని రూపాలే కనిపిస్తున్నాయి. అలాగని ఏ ఒక్క వినాయకుడికి మరో వినాయకుడితో పోలికే ఉండదు. అదే గొప్పతనం. ప్రతిచోటా రకరకాల రూపాల్లో వినాయక ప్రతిమలు మండపాల్లో కొలువుదీరాయి. స్థానిక సంస్కృతులు, సినిమాల ప్రభావం, సృజనాత్మకత…వెరసి గణేషుడు రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాడు.
కొన్నిచోట్ల గణేషుడు క్రికెట్ ఆడుతున్నాడు. ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇంకోచోట జాతీయ నాయకుల మధ్యలో ఠీవీగా కొలువుతీరాడు. బీచ్ లో సైకిత శిల్పమయ్యాడు.
ఇక సినిమా ప్రభావం ఈసారి గట్టిగానేపడింది. అల్లు అర్జున్, యష్ ల్లా గణేషుడు కనిపించాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీయార్ గెటప్ ల్లో గణేషులు చాలా చోట్ల కనిపిస్తున్నారు.