ప్రాణాలు తీసిన ఫ్రిడ్జ్.. చిన్నారులతో సహా ఐదుగురు సజీవ దహనం

మనిషికి అవసరాలు పెరిగి.. అత్యాధునిక ఆవిష్కరణలకు ఆస్కారం అవుతున్నాయి. అయితే కొన్ని కొన్ని వస్తువులు మార్కెట్‌లో చూస్తుంటే.. ఏంటీ ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయి. చిన్న అవసరాలకు కూడా యంత్రాలపై ఆధారపడిపోతున్నారు జనాలు. ఇంటి గృహోపకరణాల నుండి మర యంత్రాల వరకు అవసరాల కోసం పుట్టుకు వచ్చినవే. కానీ ఇవి ఇష్టమొచ్చినట్లు వాడటంతో పాటు జాగ్రత్త లేకపోవడంతో యంత్రాలు కూడా ప్రాణాలను తీస్తున్నాయి. ముఖ్యంగా ఏసీలు, వాటర్ హీటర్, ఫ్రిడ్జ్ వంటి పరికరాల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి విన్నాం. తాజాగా ఓ కుటుంబం కుటుంబం.. రిఫ్రిజిరేటర్ కారణంగా మృత్యువాత పడింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.

తమ ప్రాణాలు కాసేపట్లో కోల్పోతామని తెలియని ఆ కుటుంబ సభ్యులు ఆదమరిచి నిద్రపోయారు. ఊహించని విపత్తులా ఆదివారం రాత్రి వారి ఇంట్లోని ఫ్రిడ్జ్ పేలి.. మంటలు చెలరేగడంతో ఐదురుగు మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు ఉండటం విచారకరం. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రిఫ్రిజిరేటర్ కంప్రెజర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇది పేలిన తర్వాత మంటలు చెలరేగాయని, కుటుంబ సభ్యులు నిద్రపోతుండటంతో.. ఏం జరిగిందో తెలిసే సరికి మంటల్లో చిక్కుకుని సహజీదహనమయ్యారని తెలిపారు. మృతులను యశ్‌పాల్ ఘయ్ (70), రుచి ఘయ్ (40), మన్షా (14), దియా (12), అక్షయ్ (10)‌గా పోలీసులు గుర్తించారు.

Show comments