iDreamPost

హోటల్స్ లో చికెన్ తింటున్నారా? మీరు మరణాన్ని ఆహ్వానిస్తున్నట్టే!

  • Published May 31, 2024 | 5:48 PMUpdated May 31, 2024 | 5:48 PM

ఇటీవలే నగరంలో ఉన్నా పలు రెస్టారెంట్స్ లో నాణ్యత లేని, కుల్లిపోయినా, బూజి పట్టిన ఆహార పదార్ధలను విక్రయిస్తూ.. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయం తెలిసిందే. ఇక విషయంలో సోదాలు నిర్వహిస్తున్న ఫుడ్ సెఫ్టీ ఆఫీసరులు ఎప్పటికప్పుడూ పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తూ.. ఆ రెస్టారెంట్ల బాగోతాలు బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా వరంగల్ నగరంలోని మరో స్టార్ హోటల్ లో తనిఖీలు నిర్వహించడంతో అక్కడ అసలు నిజం బయటపడింది.

ఇటీవలే నగరంలో ఉన్నా పలు రెస్టారెంట్స్ లో నాణ్యత లేని, కుల్లిపోయినా, బూజి పట్టిన ఆహార పదార్ధలను విక్రయిస్తూ.. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయం తెలిసిందే. ఇక విషయంలో సోదాలు నిర్వహిస్తున్న ఫుడ్ సెఫ్టీ ఆఫీసరులు ఎప్పటికప్పుడూ పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తూ.. ఆ రెస్టారెంట్ల బాగోతాలు బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా వరంగల్ నగరంలోని మరో స్టార్ హోటల్ లో తనిఖీలు నిర్వహించడంతో అక్కడ అసలు నిజం బయటపడింది.

  • Published May 31, 2024 | 5:48 PMUpdated May 31, 2024 | 5:48 PM
హోటల్స్ లో చికెన్ తింటున్నారా? మీరు మరణాన్ని ఆహ్వానిస్తున్నట్టే!

ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ ఆన్ లైన్ ఫుడ్స్, స్టార్ హోటల్స్ మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే.. వంట చేసుకోనే తీరిక లేని దగ్గర నుంచి ఏ చిన్న పార్టీలైనా సరే అందరూ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, మంచి మంచి ఫేమస్ హోటల్స్ కు వెళ్లి తమకు నచ్చిన ఫుడ్ ను ఆరగించడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ ఫుడ్స్, హోటల్ ఫుడ్స్ లో కానీ నాణ్యత లేని ఆహారంను  విక్రయిస్తున్నారు. ముఖ్యంగా కుల్లిపోయిన, బూజి పట్టిన మాంసం,గడువు తీరిన ఆహార పదార్థలను కూడా వినియోగిస్తూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నగరంలో ఉన్న పలు రెస్టారెంట్స్ లో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆ రెస్టారెంట్ల బాగోతం బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మరో స్టార్ హోటల్ లో తనిఖీలు నిర్వహించగా కుల్లిపోయిన మాంసం విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకి ఎక్కడంటే..

ఇటీవలే నగరంలో ఉన్నా పలు రెస్టారెంట్స్ లో నాణ్యత లేని, కుల్లిపోయినా, బూజి పట్టిన ఆహార పదార్ధలను విక్రయిస్తూ.. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయం తెలిసిందే. ఇక విషయంలో సోదాలు నిర్వహిస్తున్న ఫుడ్ సెఫ్టీ ఆఫీసరులు ఎప్పటికప్పుడూ పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తూ.. ఆ రెస్టారెంట్ల బాగోతాలు బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా వరంగల్ నగరంలోని మరో స్టార్ హోటల్ లో తనిఖీలు నిర్వహించడంతో అక్కడ అసలు నిజం బయటపడింది. కాగా, హనుమకొండ పట్టణంలోని అశోక, శ్రేయ, అరణ్య హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. అయితే అక్కడ చూస్తేనే వాంతులొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అరణ్య జంగల్ థీమ్ రెస్టారెంట్​లో తనిఖీ చేయగా.. ఆ హోటల్​లో తుప్పు పట్టిన పాత్రల్లో వంటలు చేయడం, అలాగే  రిఫ్రిజిరేటర్​లో సరైన టెంపరేచర్ ​మెయింటెయిన్​చేయడం లేదని, వాటితో పాటు ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా చికెన్​నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా హానికర రంగులను కలిపిన పన్నీర్​,  బూజు పట్టిన కూరగాయలను గుర్తించి యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే  బూజు పట్టిన 26 కిలోల చికెన్​ను పడేసి నోటీసులు హోటల్ యాజమానులకు నోటీసులు ఇచ్చారు.

దీంతో పాటు హనుమకొండ చౌరస్తాలోని అశోక హోటల్ ను తనిఖీ చేయగా హానికరమైన రంగులు కలిపిన ఆహార పదార్థాలతో పాటు భారీగా ఫుడ్ కలర్స్ డబ్బాలు, 10 లీటర్ల రీ యూజ్డ్ ఆయిల్, గడువు తీరిన చికెన్ మసాలాలు, సాస్ బాటిల్స్ గుర్తించారు. వాటితో పాటు బ్యాచ్ నెంబర్, తయారు చేసిన తేదీ లేకుండా స్టోర్ రూమ్​లో నిల్వ ఉంచిన రూ.5,500 విలువైన 17 నూడుల్స్ ప్యాకెట్స్, 28 సోంపు ప్యాకెట్లను  సీజ్ చేసి, శాంపుల్స్​ను ల్యాబ్​కు పంపించారు. అలాగే, ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ల్యాబ్ నుంచి వచ్చిన శాంపిల్స్ రిజల్ట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే హోటల్ యాజమాన్యానికి ఇంప్రూవ్​మెంట్​ నోటీసుతో పాటు  ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు.

అలాగే బస్టాండ్ సమీపంలో ఉన్నా శ్రేయ హోటల్ లో తనిఖీలు చేపట్టిన అధికారులు హానికరమైన రంగులు కలిపిన చికెన్ కబాబ్స్, ఇతర చికెన్​ ఐటమ్స్​ గుర్తించారు. దీంతో పాటు అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముతున్నట్టు తెలుసుకుని యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే  సుమారు 11 కిలోల బూజు పట్టిన చికెన్,  ప్రిపేర్డ్ ఫిష్ టిక్కా, బొద్దింకలతో ఉన్న ఇడ్లి పిండి, బెల్లం పారబోశారు. మరి, వరంగల్ జిల్లాలో పలు రెస్టారెంట్లలో బయటపడిన దారుణమైన పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి