iDreamPost
android-app
ios-app

నేపాల్‌ – భారత్‌ మధ్య రైల్‌ లింక్‌ ప్రారంభం

నేపాల్‌ – భారత్‌ మధ్య రైల్‌ లింక్‌ ప్రారంభం

బీహార్‌లోని జైనగర్‌ నుంచి నేపాల్‌లోని కుర్తా వరకు మొదటి బ్రాడ్‌గేజ్‌ రైల్‌ లింకుకు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా పచ్చజెండా ఊపారు. పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ను కూడా ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం మోడీతో దేవ్‌బా ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైల్వేస్‌, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు భారత్‌తో నాలుగు ఒప్పందాలపై దేవ్‌బా సంతకాలు చేశారు.

భారత్‌-నేపాల్‌ మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి యంత్రాంగం అవసరమని, సరిహద్దు గొడవలను ఇరు దేశాలూ బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు కాలపానీ సరిహద్దు వివాదాలపైనా వారు చర్చించారు. అలాగే నేపాల్‌లో భారత రూపే చెల్లింపు కార్డును కూడా మోడీతో కలిసి దేవ్‌బా ప్రారంభించారు.

భారత్‌-నేపాల్‌ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రతిజ్ఞ చేశామని, భారత్‌తో తమ బంధం అత్యంత కీలకమని దేవ్‌బా తెలిపారు. ఈ మేరకు మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్‌-నేపాల్‌ మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవని, అటువంటి సత్సంబంధాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవని మోడీ అన్నారు. నేపాల్‌కు భారత్‌ ముందు నుంచి సన్నిహితంగా ఉందని, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ దేశ అభివృద్ధి, శాంతి కోసం భారత్‌ సహకారం ఎప్పుడూ కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇరుదేశాల సరిహద్దుల వద్ద అక్రమ కార్యకలాపాలు, నేరాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా ఓ ప్రకటనలో తెలిపారు.

రైల్‌ లింక్‌ విశేషాలు ఇవే..

– బీహార్‌లోని జైనగర్‌ను నేపాల్‌లోని జనక్‌పూర్‌లో ఉన్న కుర్తాతో అనుసంధానం చేస్తుంది. శనివారమే ఈ మార్గంలో ప్యాసింజర్‌ రైలు సేవలు ప్రారంభమయ్యాయి.
– ఈ రైల్వే లైన్‌ మనదేశంలో 2.95 కిలోమీటర్ల వరకు ఉండగా.. మిగతా 66.75 కిలోమీటర్లు నేపాల్‌లో ఉంది.
– ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు, ఆరు హాల్ట్‌ స్టేషన్లు ఉన్నాయి. అలాగే 47 రోడ్డు క్రాసింగ్‌లు, 15 మేజర్‌ బ్రిడ్జిలు, 147 మైనర్‌ బ్రిడ్జిల మీదుగా ఈ రైలు లింక్‌ వెళ్తుంది.
– 1600 హెచ్‌పీ డెమూ ప్యాసింజర్‌ వ్యాగన్లను కొంకణ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఆర్‌సీఎల్‌) నేపాల్‌కు సరఫరా చేసింది.
– బీహార్‌లోని మధుబని జిల్లా నుంచి నేపాల్‌లోని ధానుసా, మహొత్తరి, సిరాహ జిల్లాల మీదుగా ఈ మార్గంలో రైళ్లు వెళ్తాయి.
– ఈ రైల్‌ లింక్‌ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తిచేసే బాధ్యతను ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌కు (భారతీయ రైల్వేలో ఓ విభాగం) అప్పగించారు. ఇప్పటికే ఇంజనీరింగ్‌, మౌలిక సదుపాయాల పనులు పూర్తయ్యాయి.
– ఈ మార్గంలో వెళ్లే రైళ్లలో ప్రయాణించేందుకు జాతీయ పాస్‌పోర్టు, లేదా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు జారీచేసిన ఏవైనా ఫోటో గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom