iDreamPost
android-app
ios-app

Faria Abdullah : మంచిరోజుల హీరోతో జాతిరత్నాలు బ్యూటీ

  • Published Dec 29, 2021 | 4:51 AM Updated Updated Dec 29, 2021 | 4:51 AM
Faria Abdullah : మంచిరోజుల హీరోతో జాతిరత్నాలు బ్యూటీ

గత ఏడాది ఊహించని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జాతరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కెరీర్ ఆశించినంత వేగంగా పరిగెత్తడం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉన్నా సరే అవకాశాలు మాత్రం మెల్లగా వస్తున్నాయి. బంగార్రాజులో స్పెషల్ సాంగ్ చేయడం వెనుక కారణం కూడా ఇదే. ఎంత నాగార్జున నాగ చైతన్యల సినిమానే అయినా చేసింది ఐటెం నెంబర్ కాబట్టి దాని వల్ల వచ్చే గొప్ప గుర్తింపేమీ ఉండదు. ఒకవేళ పాట హిట్ అయినా ఇమేజ్ ఇంకోరకంగా బిల్డ్ అవుతుంది. ఆ మధ్య అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోనూ ఫరియా చిన్న క్యామియో చేసిన సంగతి తెలిసింది. అసలు తనున్న సంగతి కూడా ఎవరికీ గుర్తు లేదు.

వీటి సంగతలా ఉంచితే ఫరియా తాజాగా సంతోష్ శోభన్ సరసన నటించేందుకు ఓకే చెప్పిందట. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇది రూపొందనుందని టాక్. శ్యామ్ సింగ రాయ్ నిర్మాతలు దీన్ని టేకప్ చేయబోతున్నారని సమాచారం. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చు. గాంధీ ఆ మధ్య సంతోష్ శోభన్ తోనే అమెజాన్ ప్రైమ్ కోసం ఏక్ మినీ కథ చేసిన సంగతి తెలిసిందే. మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. ఇప్పుడు మరో రొమాంటిక్ కథను తీసుకుని తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది. తక్కువ బడ్జెట్ లో రిస్క్ లేకుండా ప్రాజెక్టుని సెట్ చేసుకున్నారట. మొత్తానికి ఫరియా అబ్దుల్లాకు ఒక ఫుల్ లెన్త్ రోల్ దక్కింది.

ఇక సంతోష్ విషయానికి వస్తే చిన్న సినిమాలతోనే బాగా బిజీ అవుతున్నాడు. ఇటీవలే వచ్చిన మంచి రోజులు వచ్చాయి ఫ్లాప్ అయినా కూడా ఇంకో ఏడాదికి పైగా ఖాళీ లేనంత కమిట్ మెంట్స్ ఇచ్చేశాడు. ఇండస్ట్రీకి వచ్చిన అయిదారేళ్ళ తర్వాత అతను ఈ స్థాయిలో బిజీ కావడం విశేషం. చిన్న సినిమాలకు థియేటర్ తో పాటు సమాంతరంగా ఓటిటి ఆప్షన్ కూడా వచ్చేయడం నిర్మాతలు ఇలాంటివి నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. కాస్త పేరున్న ఆర్టిస్టులు ఉంటే చాలు డిజిటల్ సంస్థలు మంచి రేట్ ఇస్తున్నాయి. అయిదు కోట్ల లోపు పూర్తి చేసుకుంటే లాభాలకు ఢోకా లేకుండా పెట్టుబడి సేఫ్ అవుతోంది. ఇప్పుడంతా ఇదే ట్రెండ్

Also Read : Tollywood New Directors : ప్రతిభను చాటుకున్న యంగ్ టాలెంట్స్

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet