iDreamPost
android-app
ios-app

సమంతా గప్ చుప్ అందుకే

  • Published Jun 01, 2021 | 6:00 AM Updated Updated Jun 01, 2021 | 6:00 AM
సమంతా గప్ చుప్ అందుకే

ఏదో భారీ సినిమా రిలీజవుతోందన్న రేంజ్ లో హైప్ తెచ్చుకున్న ఫ్యామిలీ మ్యాన్ 2 ప్రమోషన్లు ఉన్నట్టుండి సైలెంట్ అయ్యాయి. ట్రైలర్ వచ్చాక తమిళనాడు వర్గాల నుంచి ఇందులో కంటెంట్ పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రైమ్ చాలా తెలివిగా వ్యవహరిస్తూ పబ్లిసిటీ వాల్యూంని పూర్తిగా తగ్గించేసింది. విడుదల ఆపేందుకు కొందరు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ స్ట్రీమింగ్ ఆపడం జరిగే పనిలా కనిపించడం లేదు. అందులోనూ ఇవాళ జూన్ 1. ఎల్లుండి అర్ధరాత్రి లేదా అంతకు ఓ రెండు గంటల ముందే ప్రసారం మొదలైపోతుంది. ఎలాగూ కాంట్రావర్సీ వచ్చింది కాబట్టి రెగ్యులర్ ఫ్యాన్స్ కన్నా వ్యూయర్స్ ఎక్కువగా ఉంటారు.

ఇప్పుడు ఎలాంటి ప్రమోషన్ చేసినా అనవసరంగా మళ్ళీ వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చినట్టు అవుతుందని అదేదో రిలీజ్ అయ్యాక విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రైమ్ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ నిజంగా ఇబ్బంది కలిగించే కంటెంట్ ఏదైనా ఉంటే ఉన్నట్టుండి సిరీస్ లు సినిమాలు యాప్ నుంచి తీసేయడం ప్రైమ్ కు అలవాటే కాబట్టి మొదటిరోజే కోట్లాది వ్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో తాండవ్, ఇటీవల మలయాళం మూవీ కల, ఓ హిందీ సినిమా ఇలాగే చెప్పాపెట్టకుండా తీసేసి మళ్ళి పెట్టింది ప్రైమ్. అందుకే ఫ్యామిలీ మ్యాన్ ని ఫస్ట్ డేని చూసేయడం ఉత్తమమనే అభిప్రాయంలో ఉన్నారు జనం.

సమంతా కూడా ఈ కారణంగానే ఫ్యామిలీ మ్యాన్ గురించి మౌనాన్ని ఆశ్రయించింది. లేకపోతే ఈ పాటికి ఇంటర్వ్యూలంటూ మీడియాలో గట్టి హడావిడే నడిచేది. ఫస్ట్ సీజన్ మిస్ అయినవాళ్లు ఇప్పుడీ వివాదం చూసి మొదటి భాగాన్ని చూసేశారు. ఒక అంచనా ప్రకారం యాభై నిమిషాల చొప్పున ఫ్యామిలీ మ్యాన్ 2 ఎనిమిది నుంచి పది ఎపిసోడ్ల దాకా ఉండొచ్చు. ఈ వివరాలు అమెజాన్ ఇంకా బయట పెట్టలేదు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ టెర్రరిస్ట్ థ్రిల్లర్ లో ప్రియమణి తదితరులు నటించారు. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన సందీప్ కిషన్ తరహాలో ఇందులో కూడా ఏమైనా సర్ప్రైజులున్నా ఆశ్చర్యం లేదు

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet