iDreamPost
android-app
ios-app

వెంకన్న కోసం విజయసాయి వినతి… కేంద్రం మన్నిస్తుందా..?

వెంకన్న కోసం విజయసాయి వినతి… కేంద్రం మన్నిస్తుందా..?

రాజ్యసభ జీరో అవర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక అంశాన్ని ప్రస్తావించారు. టీటీడీ కి సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) రిజిస్ట్రేషన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని రాజ్యసభలో ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తిగా ఆరాధించే దైవం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామితో పాటుగా… ఈ ఆలయాన్ని పాలించే తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) చేపట్టే వివిధ సామాజిక, విద్యా, ధార్మిక, సాంస్కృతిక కార్యకలాపాలు కూడా అంతే ప్రసిద్ధి చెందాయని ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు.

ఇక టీటీడీ నిర్వహించే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని ఆయన వివరించారు. శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులతో పాటుగా విదేశాల్లో ఉండే భక్తులు ఇచ్చే కోట్లాది రూపాయల విరాళాల సహకారంతో టీటీడీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన రాజ్యసభలో ప్రస్తావించారు. విదేశీ భక్తులు ఇచ్చే విరాళాలను స్వీకరించడానికి టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ కింద గతంలోనే రిజిస్ట్రేషన్‌ పొందిందని రాజ్యసభలో గుర్తుచేశారు. ఇటీవల కాలంలో సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించడానికి నిరాకరించిందని ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు.

ఈ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ కోసం టీటీడీ చట్టపరమైన అన్ని నిబంధనలను పాటించినప్పటికీ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణకు హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత డిసెంబర్‌ 31 నాటికి టీటీడీ సమర్పించిన వార్షిక రిటర్న్‌ల ప్రకారం టీటీడీ విదేశీ విరాళాల బ్యాంక్‌ ఖాతాలో 13.4 కోట్ల రూపాయలు జమై ఉన్నాయన్నారు. డిసెంబర్‌ 2021 తర్వాత టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ చేయనందున టీటీడీ వివిధ సామాజిక, విద్యా, ధార్మిక కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందని కేంద్ర ప్రభుత్వానికి వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా హిందువులలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాధాన్యత, ప్రాచుర్యత దృష్ట్యా టీటీడీ చేపట్టే పలు కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించి టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలని విజయసాయి రెడ్డి కోరారు.

Also Read : బడ్జెట్ నిరుత్సాహపరిచింది.. ఆ ఫార్ములాతో ఏపీకి అన్యాయం: ఎంపీ విజయసాయి రెడ్డి

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomcasibommariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet giriş