iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి కళా వెంకటరావు అరెస్ట్‌..

  • Published Jan 20, 2021 | 4:28 PM Updated Updated Jan 20, 2021 | 4:28 PM
  • Published Jan 20, 2021 | 4:28 PMUpdated Jan 20, 2021 | 4:28 PM
మాజీ మంత్రి కళా వెంకటరావు అరెస్ట్‌..

టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకటరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రామతీర్థంలో దేవతామూర్తుల విగ్రహం ధ్వంసం జరిగిన తర్వాత వైసీపీ, టీడీపీ నేతలు అక్కడ పర్యటించారు. ఒకే రోజు ఇరు పార్టీల నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొంత మంది టీడీపీ కార్యకర్తలు ఎంపీ విజయసాయి రెడ్డిపై దాడికి యత్నించారు. ఆయన కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై విజయసాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దాడి చేసిన వారిని గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు.. తాజాగా కళా వెంకటరావును అరెస్ట్‌ చేశారు. కళా వెంకటరావు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు విజయసాయి రెడ్డిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు నిర్థారించుకున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంలో కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని చీపురుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes BelgiqueCasibom