iDreamPost
android-app
ios-app

నయనతార ఆస్తుల విలువ ఎంతో తెలుసా? నయన్ కి ఉన్న ఈ ఆస్తుల గురించి మీకు తెలుసా??

  • Published Jun 11, 2022 | 7:06 PM Updated Updated Jun 11, 2022 | 7:06 PM
నయనతార ఆస్తుల విలువ ఎంతో తెలుసా? నయన్ కి ఉన్న ఈ ఆస్తుల గురించి మీకు తెలుసా??

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన ప్రియుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. పలువురు సెలబ్రిటీలు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వెరీ పెళ్లి ఘనంగా జరిగింది. దీంతో మరోసారి నయనతార వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అంతా నయనతార గురించి వెతకడం మొదలుపెడుతున్నారు. తాజాగా మరోసారి నయనతారకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని ఆలోచిస్తున్నారు అంతా.

దాదాపు 19 ఏళ్ళ సినీ కెరీర్ ఉంది నయనతారకి. అయినా ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ బాగానే సంపాదిస్తుంది. గతంలో 2018లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితా లిస్ట్ లో నయనతార పేరు కూడా ఉంది. అప్పటి ఆస్తుల లెక్క ప్రకారం నయనతార మొత్తం ఆస్తుల విలువ $22 మిలియన్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.165 కోట్లు. అయితే ఇది 2018 లెక్కల ప్రకారం. ప్రస్తుతం ఈ విలువ 200 కోట్లకు చేరుకొని ఉంటుందని అంచనా. నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకి అయిదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ అయితే దాదాపు 8 కోట్లు తీసుకుంటుందని సమాచారం. ఈ లెక్కన సౌత్ లో అందరి కంటే ఎక్కువ తీసుకునే హీరోయిన్ ప్రస్తుతం నయనతారే.


ఇక నయనతార ఆస్తులని కూడా బాగానే కూడబెడుతుంది. ఓ కథనం ప్రకారం నయనతారకు హైదరాబాద్‌ బంజారాహిల్స్ లో రెండు విలాసవంతమైన గృహాలు మరియు చెన్నైలో తన తల్లిదండ్రులు ఉండే ఇల్లు, అది కాకుండా మరో రెండు 4 BHK ప్లాట్స్ ఉన్నట్టు సమాచారం. అంతే కాక మరి కొన్ని చోట్ల కూడా స్థలాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్టు సమాచారం. కేవలం ఈ స్థిరాస్తుల విలువే దాదాపు 100 కోట్లు ఉంటుందని సమాచారం.

ఇక నయనతార కి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. నయనతార ఇటీవలే కొన్ని నెలల క్రితం తన వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసింది. ఆమె మరియు ఆమె భర్త విఘ్నేష్ శివన్ తరచుగా చెన్నై-హైదరాబాద్ మరియు చెన్నై-కొచ్చి, చెన్నై-ముంబై లకు వర్క్ మీద వెళ్లి రావడానికి దీన్ని వాడతారని సమాచారం. ఇక నయనతార బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం దాదాపు ఒక్కో యాడ్ కి రూ.5 కోట్ల వరకు వసూలు చేస్తారని సమాచారం.

నయనతారకు దాదాపు రూ.74 లక్షల విలువైన BMW5 సిరీస్ కార్, రూ.88 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ GLS350డి, టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫోర్డ్ ఎండీవర్, అత్యంత ఖరీదైన 6 కోట్ల విలువ చేసే BMW 7 సిరీస్ కార్లు ఉన్నాయి. కేవలం ఈ కార్ల విలువే 10 కోట్లు ఉంటుంది. అయితే ఇవన్నీ ఆస్తులు. ఇక నయనతార పలు రంగాల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. వీటి నుంచి లాభాలు వస్తూనే ఉంటాయి, రొటేషన్ అవుతూనే ఉంటాయి.

గత డిసెంబర్ 2021లో నయనతార ది లిప్ బామ్ అనే కంపెనీని డెర్మటాలజిస్ట్ డా. రెనిటా రాజన్ భాగస్వామ్యంతో స్థాపించింది. లేడీస్ కి కావాల్సిన అన్ని రకాల కాస్మటిక్ ప్రోడక్ట్స్ ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు చాయ్ వాలే అనే రెస్టారెంట్ లలో పెట్టుబడులు పెట్టింది. ఇవే కాకుండా విగ్నేష్ తోకలిసి రౌడీ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి వరుస సినిమాలు తీస్తుంది నయనతార. మొత్తానికి లాంగ్ కెరీర్ లో బాగానే సంపాదించి ఇప్పుడు విగ్నేష్ తో కలిసి మరింత సంపాదించడానికి ముందుకెళ్తుంది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet