iDreamPost
android-app
ios-app

దోచేవారెవరురా పాట కోసం దిగ్గజ దర్శకుల కలయిక

  • Published Sep 24, 2022 | 4:11 PM Updated Updated Sep 24, 2022 | 4:19 PM
  • Published Sep 24, 2022 | 4:11 PMUpdated Sep 24, 2022 | 4:19 PM
దోచేవారెవరురా పాట కోసం దిగ్గజ దర్శకుల కలయిక

స్టార్లు లేకపోయినా చిన్న ఆర్టిస్టులతోనే బ్లాక్ బస్టర్స్ సాధించవచ్చని నిరూపించిన దర్శకులు శివ నాగేశ్వరరావు గారు మళ్ళీ మెగా ఫోన్ చేపట్టి తీస్తున్న సినిమా దోచేవారెవరురా. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో మనీ, మనీ మనీ, సిసింద్రీ, లక్కీ ఛాన్స్, పట్టుకోండి చూద్దాం లాంటి ఎన్నో మరపురాని ఆణిముత్యాలను అందించిన లెజెండరీ డైరెక్టర్ వాటికే మాత్రం తీసిపోని రీతిలో దోచేవారెవరురాని రూపొందిస్తున్నారు. అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా మిగిలిన తారాగణమంతా దాదాపుగా కొత్తవారే ఉండటం విశేషం. ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత బొడ్డు కోటేశ్వరరావు తన మొదటి చిత్రంగా మంచి బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇటీవలే దీనికి సంబంధించిన ఓ కీలక పాట చిత్రీకరణ పూర్తి చేశారు. ఖల్లాసు అన్నీ వర్రీసు అంటూ సాగే ఈ క్యాచీ బీట్ సాంగ్ ని రోహిత్ వర్ధన్ ఇట్టే ఆకట్టుకునే ట్యూన్ తో స్వరపరిచారు. శివనాగేశ్వరరావు గారితో కెరీర్ ప్రారంభం నుంచే సుదీర్ఘ స్నేహం అనుబంధం కలిగిన ప్రముఖ దర్శకులు తేజ గారు ఇచ్చిన కొన్ని క్రియేటివ్ ఇన్ ఫుట్స్ ఈ పాట కోసం వాడటం విశేషం. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు గీతం మరింత చక్కగా వచ్చేందుకు ఉపయోగపడటంతో గ్రాండ్ విజువల్స్ తో తీసేందుకు నిర్మాతలు తమ అంగీకారం తెలిపారు. ఇటీవలే షూట్ చేసిన ఈ పాట తాలూకు మేకింగ్ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఖరీదైన సెట్ తో పాటు ఎందరో ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారు

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న దోచేవారెవరురా అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను మనసారా నవ్వించడమే లక్ష్యంగా శివనాగేశ్వరరావు గారి గత చిత్రాల స్థాయిలో ఏ మాత్రం తగ్గకుండా అంచనాలు అందుకునేలా ఇది ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. అర్లీ ఛాయాగ్రహణం, శివ వై ప్రసాద్ ఎడిటింగ్, రోహిత్ వర్ధన్ – కార్తిక్ సంగీతం, చైతన్య ప్రసాద్ – సిరాశ్రీ-శివనాగేశ్వరరావు సాహిత్యం, శంకర్ -శ్యామ్ నృత్యాలు, అంజి పోరాటాలు, వెంకట్- రాజశేఖర్ ల ఆర్ట్ డైరెక్షన్ లతో దోచేవారెవరురా బలమైన టీమ్ తో సిద్ధమవుతోంది. భారీ యాక్షన్ చిత్రాల తాకిడిలో నవ్వులు పూయించే ఈ సినిమా అతి త్వరలోనే రాబోతోంది.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom