iDreamPost
android-app
ios-app

‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌లో హైలెట్ అయిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా??

  • Published May 04, 2022 | 2:17 PM Updated Updated May 04, 2022 | 2:38 PM
  • Published May 04, 2022 | 2:17 PMUpdated May 04, 2022 | 2:38 PM
‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌లో హైలెట్ అయిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా??

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు కూడా భారీగా హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ పరుశురాం ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేయించాడు. ట్రైలర్ చూసిన వాళ్లంతా వింటేజ్ మహేష్ మళ్ళీ వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లవ్, యాక్షన్, కామెడీ, ఎమోషనల్.. ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ ట్రైలర్ చూస్తే సినిమా పక్కా కమర్షియల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక యూట్యూబ్ లో 24 గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది ఈ ట్రైలర్.

ట్రైలర్ రిలీజ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఈ ట్రైలర్ లో ఒక రెండు సార్లు కనిపించిన అమ్మాయి కోసం వెతికేస్తున్నారు అంతా. ఒక సీన్ లో హీరోయిన్ పక్కన, ఇంకో సీన్ లో వెన్నెల కిషోర్ పక్కన కనిపించిన ఈ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. అయితే ట్రైలర్ చూస్తే ఈ అమ్మాయి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది.

ట్రైలర్ తో అందర్నీ తనవైపుకు తిప్పుకున్న ఈ అమ్మాయి పేరు సౌమ్య మీనన్. ఈమె మలయాళ నటి. మలయాళంలో కినవల్లి, ఫ్యాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్.. ఇలా దాదాపు ఒక అరడజను పైగా సినిమాలు హీరోయిన్ గా చేసింది సౌమ్య. ప్రస్తుతం సౌమ్య చేతిలో ఒక కన్నడ సినిమా, రెండు మలయాళ సినిమాలు, ఒక తెలుగు సినిమా కూడా ఉంది. ఇవి కాకుండా సర్కారు వారి పాట సినిమాలో కూడా నటించింది. సౌమ్య నటి మాత్రమే కాదు మంచి డ్యాన్సర్ కూడా. మలయాళంలో కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. మరి సర్కారు వారి పాట సినిమాతో తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు ఈ మలయాళ కుట్టికి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss