iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం: లారెన్స్‌కు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కన్నుమూత

  • Published Nov 08, 2023 | 12:56 PM Updated Updated Nov 08, 2023 | 12:56 PM

సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మాలీవుడ్ టీవీ, సినీ నటులు రెంజుషా మీనన్, డా. ప్రియ మరణించిన సంగతి విదితమే. టాలీవుడ్ నటి ఝాన్సీ మేనేజర్, డైరెక్టర్ వెంకీ కుడుమల ఇంట్లో కూడా విషాదాలు నెలకొన్నాయి.

సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మాలీవుడ్ టీవీ, సినీ నటులు రెంజుషా మీనన్, డా. ప్రియ మరణించిన సంగతి విదితమే. టాలీవుడ్ నటి ఝాన్సీ మేనేజర్, డైరెక్టర్ వెంకీ కుడుమల ఇంట్లో కూడా విషాదాలు నెలకొన్నాయి.

  • Published Nov 08, 2023 | 12:56 PMUpdated Nov 08, 2023 | 12:56 PM
ఇండస్ట్రీలో విషాదం: లారెన్స్‌కు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కన్నుమూత

సినీ పరిశ్రమలో వరుసగా విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమను విషాద వార్తలు వెంటాడుతున్నాయి. గత నెలలో మలయాళ పరిశ్రమకు చెందిన సినీ, టీవీ నటులు రెంజుషా మీనన్, డా. ప్రియ మరణించిన సంగతి విదితమే. రెంజుషా ఆత్మహత్య చేసుకోగా.. ప్రియా గుండెపోటుతో మృతి చెందింది. ఇంతలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కజిన్ జ్వరంతో తుది శ్వాస విడిచారు. అలాగే టాలీవుడ్ యాంకర్ కమ్ నటి ఝాన్సీ మేనేజర్ శ్రీను గుండెపోటుతో కన్నుమూశారు. ఇవన్నీ మరిచి పోక ముందే తమిళ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ ప్రమాదవశాత్తూ మరణించారు. ఆయన తెలుగులో ప్రముఖ హీరోతో సినిమా కూడా రూపొందించారు.

కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అర్పుదాన్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన.. చికిత్స పొందతూ మరణించారు. సోమవారం సాయంత్రం మృతి చెందగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైడ్ డ్యాన్సర్‌గా కెరీర్ మొదలు పెట్టిన హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ లైఫ్ ఇచ్చిన దర్శకుడు ఆయన. 2002 అర్పుతం సినిమాతోనే లారెన్స్ హీరోగా మారాడు. ఈ  చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మిమ్స్ నిర్మించింది. ఈ మూవీ లారెన్స్ కెరీర్‌కు పునాది వేసింది. శ్యామ్ తో మనతోడు మజైకాలం అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు  అర్పుదాన్. తెలుగులో ఉదయ్ కిరణ్ తో కలిసి లవ్ టుడేను తెరకెక్కించారు. ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడిన ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మరణించారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom