iDreamPost
android-app
ios-app

రూ. 2,355 కోట్లు. పైరేట్స్ ఆఫ్ క‌రేబియ‌న్ సిరీస్ లో న‌టించ‌డానికి జానీ డెప్ కి డిస్సీ ఆఫ‌ర్

  • Published Jun 27, 2022 | 1:12 PM Updated Updated Jun 27, 2022 | 1:12 PM
  • Published Jun 27, 2022 | 1:12 PMUpdated Jun 27, 2022 | 1:12 PM
రూ. 2,355 కోట్లు. పైరేట్స్ ఆఫ్ క‌రేబియ‌న్ సిరీస్ లో న‌టించ‌డానికి జానీ డెప్ కి డిస్సీ ఆఫ‌ర్

హాలీవుడ్ స్టార్ జానీడెప్, త‌న మాజీ భార్య అంబ‌ర్ హ‌ర్ట్ పై ప‌రువున‌ష్టం వేసిన‌ప్పుడు, ఉద్దేశం డ‌బ్బులు కాదు, ఫ్యాన్స్ లో దెబ్బ‌తిన్న త‌న గౌర‌వాన్ని తిరిగిపొంద‌డం. చివర‌కు డెప్ గెల్చాడు. రెప్యుటేష‌న్ ను మ‌ళ్లీ సంపాదించుకున్నాడు. ఇప్ప‌డు డిస్నీ నుంచి భారీ ఆఫ‌ర్ ను పొందాడు.

అస‌లు పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్ నుండి జానీ డెప్‌ను డిస్నీ ఎందుకు త‌ప్పించింది?

హీరోపై అత‌ని మాజీ భార్య అంబ‌ర్ గృహ‌హింస ఆరోప‌ణలు చేసింది. త‌న‌ను కొట్టాడ‌ని అంది. మీడియాలో అత‌నికి వ్య‌తిరేకంగా చాలా ఇంట‌ర్వ్యూలిచ్చింది. అంతే, క‌రేబియ‌న్ ఫ్రాంచైజీ నుంచి డెప్ ను డిస్నీ తొల‌గించింది. అత‌ని కెరీర్ దెబ్బ‌తింది. కొన్నేళ్ల క్రితం వ‌ర‌కు హాలీవుడ్ లోనే ఎక్కువ ఫీజు తీసుకొనే న‌టుల్లో ఒక‌డిగా ఉన్న డెప్, ఇప్పుడు కెరీర్ ను నిల‌బెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు.

జానీ డెప్ కు డిస్నీ క్షమాపణలు

మాజీ భార్య ఆరోప‌ణ‌ల‌పై డెప్ ను కాద‌నుకున్న డిస్నీ, కోర్టు కేసులో గెల‌వ‌డంతో మ‌న‌సు మార్చుకుంది.
ఆస్ట్రేలియ‌న్ పాప్ క‌ల్చ‌ర్ వెబ్ సైట్ Poptopic.com ప్రకారం, జానీ డెప్‌కు డిస్నీ క్షమాపణలు పంపింది. పైరేట్స్ సినిమాలో జాక్ స్పారోగా తిరిగి రావడానికి డిస్నీ అతనికి రూ. 2,355 కోట్ల రెమ్యునిరేష‌న్ ను ఆఫ‌ర్ చేసింది. జాక్ స్పారో పాత్రలో తిరిగి రావాలని నటుడిని డిస్నీ కోరింది.

అధికారిక ప్రకటన వెలువడేంత వ‌ర‌కు జానీ డెప్ మ‌ళ్లీ జాక్ స్పారోలా స్క్రీన్ మీద‌కు వ‌స్తాడా అన్న‌ది తెలియ‌దు. జానీ డెప్ కు ఫ్రాంచైజీలో చోటులేద‌ని స్క్రీన్ రైటర్స్ ఇంత‌కుముందే చెప్పారు.

ఇదంతా ఫ్రాంచైజీల కాలం. ఒక‌ప్పుడు క‌రేబియ‌న్ సీరీస్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే ఎవేంజ‌ర్స్ త‌ర‌హాలో ఈ సీరీస్ ను రీబూట్ చేయాలని స్టూడియో ప్ర‌య‌త్నిస్తోంది. కాని త‌న‌ను వెన్నుపోటు పోడిచిన‌ట్లు డెప్ ఒక ఇంట‌ర్వ్యూలో బాధ‌ప‌డ్డాడు. 300 మిలియన్ డాలర్లు అంట‌తే రూ.1950 కోట్లు ఇచ్చినా, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ ఫ్రాంచైజీలో తిరిగి న‌టించ‌న‌ని జానీ డెప్ అన్నాడు.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet