iDreamPost
android-app
ios-app

అన్నపై ప్రేమను చాటుకున్న ధృవ సర్జా.. సమాధి వద్ద భార్య సీమంతం

  • Published Sep 12, 2023 | 6:24 PM Updated Updated Sep 12, 2023 | 7:18 PM
  • Published Sep 12, 2023 | 6:24 PMUpdated Sep 12, 2023 | 7:18 PM
అన్నపై ప్రేమను చాటుకున్న ధృవ సర్జా.. సమాధి వద్ద భార్య సీమంతం

కన్నడ సీమ నుండి వచ్చి తెలుగులో సత్తా చాటిన నటుడు అర్జున్‌ సర్జా. అతడి నుండి నట వారసత్వం పొందారు అర్జున్ మేనల్లుళ్లు చిరంజీవి సర్జా, ధృవ సర్జా. ఇద్దరూ సినిమాల్లో రాణిస్తుండగా.. 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో చిరంజీవి సర్జా హార్ట్ ఎటాక్‌తో మరణించారు. అప్పటికే అతడి భార్య, నటి మేఘనా రాజ్ గర్భిణి. మరికొన్ని రోజుల్లో వారి ఇంట్లో బోసినవ్వులు వినిపిస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన మేఘనా.. బిడ్డ కోసం ఆ బాధను పంటి బిగువున అణుచుకుంది. చిరంజీవి సర్జా చనిపోయిన కొన్ని నెలలకు ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మళ్లీ చిరంజీవి పుట్టాడని అంతా భావించారు. అతడు దూరమైన.. అతడి జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతుంది కుటుంబం.

చిరంజీవి లేకపోయినా.. తమ మదిలో బతికే ఉన్నాడని భావించిన ఆ కుటుంబం.. ఓ కార్యక్రమాన్ని అతడి సమాధి వద్ద నిర్వహించింది. చిరంజీవి సోదరుడు, కన్నడ నటుడు ధృవ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శాండిల్ వుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అతడి భార్య ప్రేరణ ప్రస్తుతం గర్భిణీ. అయితే ఆమె సీమంతం వేడుకలను ఇటీవల నిర్వహించారు. ఇంట్లో కాకుండా చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో చేశారు. ఈ వేడుకను శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని చేపట్టారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ధృవ ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. కాగా, ఈ జంటకు గతంలో ఓ పాప ఉంది. ఆ వీడియోలో ఆ పాపకు.. తల్లి ప్రేరణ ఫోనులో చిరంజీవి సర్జా ఫోటో చూపిస్తూ.. ఎవరూ చెప్పు అంటూ దొడ్డప్ప అని పలికిస్తోంది.

ఈ వేడుకకు ధృవ తల్లిదండ్రులు, ఇతర బంధువులు హాజరయ్యారు. ఈ వేడుక ప్రస్తుతం కన్నడ సీమలోనే కాకుండా అభిమానుల్లో కూడా ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది. సినీ నటులకు డబ్బులకు కొదవ ఉండదు. వేడుకలను పెద్ద పెద్ద హోటల్స్ లో..  గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ తన అన్న మీద ప్రేమతో.. ఫామ్ హౌస్ లో నిర్వహించడంపై ధృవపై తమ ప్రేమను కురిపిస్తున్నారు అభిమానులు. ధృవ ప్రస్తుతం కేడీ, మార్టిన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఈ వేడుకకు చిరంజీవి సర్జా భార్య మేఘనా, కుమారుడు రేయాన్ రాలేదని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet