iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ట్విస్టుల మీద ట్విస్టులు.. మళ్లీ హౌస్ లోకి ధామిని- రతిక?

  • Published Oct 05, 2023 | 3:13 PM Updated Updated Oct 05, 2023 | 3:13 PM
  • Published Oct 05, 2023 | 3:13 PMUpdated Oct 05, 2023 | 3:13 PM
Bigg Boss 7 Telugu: ట్విస్టుల మీద ట్విస్టులు.. మళ్లీ హౌస్ లోకి ధామిని- రతిక?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా ఉంటుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే మరీ చెప్పినంత ఉల్టా పుల్టాగా ఏం అనిపించలేదు. కానీ, ఆరు సీజన్లతో పోలిస్తే.. కాస్త డిఫరెంట్ గానే లీడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు హౌస్ లో గేమ్ మరీ రక్తి కట్టించే ధోరణిలో లేదనే చెప్పాలి. అందుకే వీళ్లని నమ్ముకుంటే వర్కౌట్ కాదని బిగ్ బాస్ కూడా భావించినట్లు ఉన్నాడు. అందుకే గ్రాండ్ లాంఛ్ 2.0 పేరిట పెద్ద స్కెచ్చే వేశాడు. ఇప్పటికే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా హింట్స్ మీద హింట్స్ ఇచ్చాడు. ఇకపై హౌస్ లో ఆట గేర్లు మారబోతోందని చెప్పాడు. అలాగే వాళ్లకు ఇచ్చిన పవరాస్త్రాలు, హౌస్ మేట్ కీస్ ని కూడా వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేందుకు రెడీ అయిపోయారు.

బిగ్ బాస్ సీజన్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో లీకులు మీద లీకులు వచ్చే విషయం తెలిసిందే. ఈ సీజన్ కూడా ప్రారంభం అయినప్పటి నుంచి నెట్టింట లీకులు గట్టిగానే వస్తున్నాయి. వాటిలో 90 శాతానికి పైగా నిజమే అవుతున్నాయి. హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ మొదలు.. ఎలిమినేట్ అయ్యే వారి వరకు అన్నీ పక్కాగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు వాళ్లే కొత్త లీకులు చేస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీలు, గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటుందని బల్ల గుద్ది చెబుతున్నారు. ఈ సీజన్ ప్రారంభం నుంచే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని ప్రేక్షకులు అంతా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే 14 మందితో 15 వారాల ఆట సాగదు. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో పది మంది ఉన్నారు. కొత్తగా ఇంకో ఏడుగురిని పంపుతారంటూ టాక్ వినిపిస్తోంది.

వైల్డ్ కార్డులకు సంబంధించి దాదాపు 5 పేర్లు ఖరారు అయ్యాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంజలి పవన్, అంబటి అర్జున్, భోలే షావలి, పూజా మూర్తి, నయని పావని పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన సింగర్ ధామినీ, రతికా రోజ్ కూడా వైల్డ్ కార్డు రూపంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ధామినీ అయితే మరోసారి అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను అంటూ తన ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఈ షో వల్ల ఇద్దరికీ ఇప్పటికే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. మరోసారి వెళ్లి దానిని పాజిటివ్ గా మార్చుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్లే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ హిస్టరీలో ఇలా ఎలిమినేట్ అయిన వాళ్లు హౌస్ లోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇంక ఎలిమినేషన్ కి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ వీక్ హౌస్ లో ముగ్గురిని ఎలిమినేట్ ఛాన్సెస్ ఉంటాయని చెబుతున్నారు. వారిలో ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఒకరిని సీక్రెట్ రూమ్ కు పంపుతారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలా జరుగుతుంది అని మాత్రం బలంగా చెప్పలేం. కానీ, బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగచ్చు అని మాత్రం చెప్పగలం. పైగా ఈ సీజన్ లో ఎలాంటి రూల్స్ కూడా ఉండవు అన్నట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ కూడా నచ్చినప్పుడు రూల్స్ మార్చేస్తున్నాడు. మరి.. ధామిని- రతికా రోజ్ రీ ఎంట్రీ ఇస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş