iDreamPost
android-app
ios-app

దసరా త్రయం! లెక్కల్లో రేర్ ఫీట్..?

  • Author ajaykrishna Updated - 05:28 PM, Thu - 19 October 23
  • Author ajaykrishna Updated - 05:28 PM, Thu - 19 October 23
దసరా త్రయం! లెక్కల్లో రేర్ ఫీట్..?

ఈసారి దసరా ఫెస్టివల్ సినిమా లవర్స్ కి సాలిడ్ గా సిద్ధం చేసింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ వార్ సెట్ అయ్యింది. పందెంలో మొత్తం మూడు సినిమాలు పోటీ పడుతుండగా.. ఆల్రెడీ రెండు బరిలో దిగాయి. ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే.. సినిమాలు క్రియేట్ చేసుకున్న బజ్ ప్రకారం రికార్డులు తిరగరాయాల్సి ఉంది. అందులోనూ దసరా సెలవులు బాగా కలిసి వచ్చాయి. కాబట్టి.. ఓ మాంచి సాలిడ్ మూవీ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి ఇది మంచి అవకాశం. మూడు సినిమాలు స్టార్స్ వే.. ఒకటి డబ్బింగ్ మూవీ అయినా.. దానికి స్ట్రెయిట్ మూవీస్ రేంజ్ లో క్రేజ్ ఉందంటే అర్ధం చేసుకోవచ్చు.

ఈ దసరా పండుగకు బాక్సాఫీస్ పందెంలో దిగుతున్న సినిమాలు లియో.. భగవంత్ కేసరి.. టైగర్ నాగేశ్వరరావు. ఈ మూడు సినిమాలు దేనికవే సపరేట్ హైప్ ఏర్పరచుకున్నాయి. కాకపోతే థియేటర్స్ వద్ద ఎలా పెర్ఫార్మన్స్ చేస్తాయనేది పాయింట్. ముందుగా లియో.. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. వరల్డ్ వైడ్ దీని హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. ఇది లోకేష్ కనగరాజ్ సినిమా. ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు లోకేష్. ఇప్పుడు లియో మూవీ కూడా అందులో భాగంగానే వస్తుందని తెలిసి ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు.

ఆ విధంగా లియో బజ్ హై లెవెల్ కి చేరింది. బాక్సాఫీస్ లెక్కలు మాత్రం విజయ్ కెరీర్ లో బెస్ట్ గా రాబోతున్నాయని టాక్ ఉంది. ఇక లియోతో పాటు భగవంత్ కేసరి రిలీజ్ అయ్యింది. బాలకృష్ణ – శ్రీలీల – కాజల్ అగర్వాల్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ఇది. రొటీన్ ఫార్ములా పక్కన పెట్టి.. కొత్తగా ట్రై చేశాడని టాక్. సో.. బాలయ్య – అనిల్ టాలీవుడ్ లో కొత్త లెక్కలు నమోదు చేస్తారేమో చూడాలి. మూడోది టైగర్ నాగేశ్వరరావు.. మాస్ రాజా రవితేజ నటించిన ఈ సినిమా ట్రైలర్ తో ఫుల్ హైప్ సెట్ చేసింది. అందుకు కారణం.. ఇండియన్ రాబిన్ హుడ్ టైగర్ నాగేశ్వరరావు స్టోరీ. ఈ సినిమాకు కంటెంట్ పై ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. మరి రేపు రిలీజ్ అవుతున్న సినిమా.. పాన్ ఇండియా వైడ్ ప్రకంపనలు సృష్టిస్తుందేమో చూడాలి. మరి ఈ మూడు కలిసి బాక్సాఫీస్ ని కళకళలాడిస్తాయా లేదా? వసూళ్ల పరంగా కొత్త లెక్కలు తిరగరాస్తాయేమో చూడాలి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş