iDreamPost
android-app
ios-app

లోకనాయకుడితో డాన్స్ ఫ్యామిలీ – Nostalgia

  • Published Mar 03, 2020 | 7:17 AM Updated Updated Mar 03, 2020 | 7:17 AM
  • Published Mar 03, 2020 | 7:17 AMUpdated Mar 03, 2020 | 7:17 AM
లోకనాయకుడితో డాన్స్ ఫ్యామిలీ – Nostalgia

దక్షిణాది సినిమా పరిశ్రమ వరకు డాన్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభుదేవా. అతని తమ్ముడు రాజు సుందరం కూడా తక్కువేమి కాదు. ఒకప్పుడు ఈ ఇద్దరి డిమాండ్ ఏ స్థాయిలో ఉండేదంటే హీరోలైనా ఈజీగా దొరికేవాళ్ళేమో కానీ వీళ్ళ కాల్ షీట్స్ సంపాదించడం నిర్మాతలకు కష్టంగా ఉండేది. నృత్యం వీళ్ళ రక్తంలోనే ఉంది. సుప్రసిద్ధ డాన్స్ మాస్టర్ సుందరం సంతానంగా తండ్రిని మించిన పేరుని తెచ్చుకోవడంలో కొడుకులు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.

ప్రభుదేవా ఇంకో మెట్టు పైకెక్కి తెలుగు తమిళ హిందీలో సినిమాలు కూడా డైరెక్ట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో గ్యాంగ్ లీడర్ కోసం టెర్రిఫిక్ స్టెప్స్ కంపోజ్ చేసిన పేరు తెచ్చుకున్న ప్రభుదేవా ఆ తర్వాతి కాలంలో శంకర్ దాదా జిందాబాద్ కు దర్శకుడిగా మారే స్థాయికి ఎదిగాడు. సుందరం మాస్టర్ రిటైర్ అయ్యాక కూడా ఓంకార్ ఆట లాంటి షోలకు జడ్జ్ గా చేసి చాలా పేరు గడించారు. రాజు సుందరం ఇప్పటికీ టాలీవుడ్ లో పలు క్రేజీ సినిమాలకు కోరియోగ్రఫీ చేస్తూనే ఉంటారు.

ఇక ఇక్కడి ఫోటో విషయానికి వస్తే ఇది 1989లో తమిళ్ లో వచ్చిన వెట్రి విజా షూటింగ్ సందర్భంగా తీసుకున్నది. దీన్ని తెలుగులో విజేతలు పేరుతో డబ్బింగ్ చేశారు. రెండు భాషల్లోనూ హిట్ అయ్యింది. నాగార్జునతో చైతన్య తీసిన ప్రతాప్ పోతన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి యాక్షన్ థిల్లర్. గతం మరిచిపోయిన ఓ సిబిఐ ఆఫీసర్ కథగా దీన్ని తెరకెక్కించిన తీరు అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇళయరాజా సంగీతం మరో ప్రధాన ఆకర్షణ.

ఈ పిక్ సినిమాలో తత్తోమ్ తళాంగు తత్తోమ్ అనే పాట చిత్రీకరిస్తుండగా క్లిక్ మనిపించింది. ఇందులో శ్రీహరి భార్య సినిమాలో కీలక పాత్ర వేసిన డిస్కో శాంతి కూడా కమల్ తో పాటుగా డాన్స్ చేశారు. ఒక కుటుంబం మొత్తం డాన్స్ కే అంకితం కావడం విశేషమేగా. అందులోనూ ముగ్గురు కలిసి లోకనాయకుడు కమల్ హాసన్ తో ఫోటో దిగడం అంటే నిజంగా స్పెషల్ అకేషనే. ఈ విజేతలులో రజనితో పాటు అమల మరో హీరోయిన్ గా నటించింది

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet