Idream media
Idream media
అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా కొన్ని తప్పులు చేయడం సహజం. పాలకుల విధానాలు నచ్చనప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అది ఆందోళనల రూపంలో కనిపిస్తుంది. సాధారణంగా ప్రభుత్వంపై ఆందోళనలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు విధానాలపై నిరసనలు వ్యక్తమవుతుండడం గమనార్హం. అది కూడా ఏ ప్రత్యర్థి పార్టీయే.. ఆ పార్టీకి చెందిన నేతలో కాదు.. ప్రజా సంఘాలు. ఆ నిరసనలో భాగంగా చంద్రబాబుపై వాళ్లకున్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తీరును పరిశీలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
చంద్రబాబు అంబేడ్కర్ కల్పించిన హక్కులను హరించారు…
చంద్రబాబు ఆలోచనలు బ్రిటీష్ వారి పాలన కన్నా ఘోరంగా ఉన్నాయని బహుజన పరిరక్షణ సమితి సంఘాలు మండిపడ్డాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీక్షల్లో పలువురు దళిత నేతలు మాట్లాడుతూ సమాజంలో దళితులకు సమానత్వం, ఆత్మ గౌరవం కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి హక్కులు కల్పిస్తే.. ఆ హక్కులను హరిస్తూ చంద్రబాబు కుల రాజధాని నిర్మాణం చేశాడన్నారు. చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించి దళితులకు అడ్డుపడకుండా ఉండాలని కోరుతూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బహుజన పరిరక్షణ సమితికి చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు. కాగా, తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ నుంచి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు, పాలనా వికేంద్రీకరణ, పేదలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య కోరుతూ 56 దళిత సంఘాలు శనివారం ర్యాలీ నిర్వహించాయి. మందడం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పలువురు నేతలు మాట్లాడారు. చంద్రబాబు చర్యలతో ఏపీకి కలిగిన, కలుగుతున్న నష్టాలను తెలిపారు.