iDreamPost
android-app
ios-app

క్రికెట‌ర్ KL రాహుల్, అథియా శెట్టి పెళ్లి డేట్‌పై మామ‌ సునీల్‌ శెట్టి ఏమ‌న్నారు?

  • Published Jul 13, 2022 | 5:03 PM Updated Updated Jul 13, 2022 | 5:03 PM
  • Published Jul 13, 2022 | 5:03 PMUpdated Jul 13, 2022 | 5:03 PM
క్రికెట‌ర్  KL రాహుల్, అథియా శెట్టి పెళ్లి డేట్‌పై మామ‌ సునీల్‌ శెట్టి ఏమ‌న్నారు?

అథియా శెట్టితో KL రాహుల్ మూడేళ్ల‌ నుంచి డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇద్ద‌రూ క‌ల‌సి ఇన్ స్టా ఫోటోలు షేర్ చేసుకున్నారు. త‌న కాబోయే భార్య సోద‌రుడు, అహన్ శెట్టి తొలి సినిమా తడప్ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ కోసం అతియా శెట్టితో క‌ల‌సి రాహూల్ ఫోటోలు దిగాడు.

KL రాహుల్ , అతియా శెట్టి ప్రేమ కాల పరీక్షగా నిలిచింది. ఒక‌రినొక‌రు ప్రోత్స‌హించుకున్నారు. ఎమోష‌న‌ల్ సపోర్ట్ గా నిలిచారు. ఆ అనుబంధానికి నిద‌ర్శ‌నంగా, KL రాహుల్, అథియా శెట్టి
ప‌బ్లిక్ గానే క‌లిసి క‌నిపిస్తున్నారు.

KL రాహుల్ ,అతియా శెట్టి వ‌చ్చే 3 నెలల్లో కాని, ఆ త‌ర్వాత కాని పెళ్లి చేసుకోనున్నారు. ఆ మేర‌కు అప్పుడే ఎర్పాట్లు మొద‌లైయ్యాయి. ఇరు కుటుంబాలు క‌లిశారు. అన్ని విష‌యాలు మాట్లాడుకున్నారు. ఈ ప్రేమ‌ను ఆశ్వీర‌దించారు. రాహూల్ ఫ్యామిలీకి అతియా శెట్టి బాగా న‌చ్చిదంట‌. కొత్త జంట అప్పుడే ఒక ఇంటిని వెతుక్కొంటున్నారు. పెళ్లి ఏర్పాట్ల కోసం రాహూల్ పేరెంట్స్ ముంబైలో ఉంటున్నారు.

జూన్ లో కేఎల్ రాహుల్‌కి గజ్జలో గాయమైంది. దాంతో జూన్ లోనే జర్మనీకి వెళ్లిన కేఎల్ రాహుల్ అక్కడ సర్జరీ కూడా చేయించుకున్నాడు. అతనితో కలిసి అతియా శెట్టి కూడా జర్మనీకి వెళ్లింది. ఫిట్‌నెస్ కోసం కొన్ని రోజుల పాటు ఆటకి దూరంగా ఉండనున్నాడు. ఈ త‌రుణంలో అతియా శెట్టితో అతనికి వివాహం చేయాలనుకున్న రాహూల్ ఫ్యామిలీ, అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టితో కూడా మాట్లాడినట్లు రాహ‌ల్ స‌న్నిహితులు చెప్పారు.

కేఎల్ రాహుల్‌తో పెళ్లిపై అతియా శెట్టి ఫన్నీగా స్పందించింది. ‘‘మూడు నెలల్లో జరగబోయే ఆ వివాహానికి నన్ను కూడా ఇన్వైట్ చేస్తార‌నుకుంటాన్నా’’ అంటూ కామెంట్ చేసింది. సునీల్ శెట్టి (Suniel Shetty) ‘కేఎల్ రాహుల్, అతియా శెట్టి గత మూడేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇప్పటి వరకూ వాళ్ల పెళ్లి ఏర్పాట్లు చేయలేదు’’ అని సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetnano girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş