iDreamPost
android-app
ios-app

హద్దులు దాటిన క్రియేటివిటీ, పుట్టిన పిల్లాడికి ఏకంగా 27 పేర్లు పెట్టిన తండ్రి

హద్దులు దాటిన క్రియేటివిటీ, పుట్టిన పిల్లాడికి ఏకంగా 27 పేర్లు పెట్టిన తండ్రి

పిల్లలకు పేర్లు పెట్టాలంటే అమ్మా నాన్న చేసే కసరత్తు అంతా ఇంతా కాదు. దగ్గరవాళ్ళను అడుగుతారు. పుస్తకాలు తిరగేస్తారు. ఈరోజుల్లో అయితే ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తుంటారు. ఇంతా చేసి ఏదో ఒక పేరు ఫిక్స్ చేసి ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఒక జంట తమ పిల్లాడికి ఏకంగా 27 పేర్లు పెట్టింది. వాటిలో ఇప్పుడు చాలా పేర్లు ఆ తండ్రికే గుర్తు లేవు.  1970ల్లో ఈ జంటకు బాబు పుట్టాడు. అప్పటికే వీళ్ళిద్దరూ ఒక హిప్పీ గ్రూపులో సభ్యులు. ఇందులో చాలా మంది హిప్పీలుండేవారు. వాళ్ళందరినీ సొంతవాళ్ళుగానే భావించేదీ జంట. అందుకే తమ పిల్లాడికి తోచిన పేరు చెప్పాలని మిగతా వాళ్ళను అడిగారు.

పిల్లాడి తండ్రి పెట్టిన మొదటి పేరు “రెయిన్” (Rain)! మిగతావాళ్ళు స్టార్మ్ (Storm), థండర్ (Thunder), క్లౌడ్ (Cloud), ఫైర్ (Fire), విండ్ (Wind)- ఇలా మొత్తం 27 పేర్లు పెట్టారు. వీటిలో చాలా పేర్లు ఆ తండ్రికే గుర్తు లేవు. కానీ మొత్తం 27 అన్నది మాత్రం గుర్తుంది. వీటిలో ఏదైనా ఎంచుకోవచ్చు లేక పూర్తిగా కొత్త పేరు ఎంచుకోవచ్చని తల్లిదండ్రులు బాబుకు చిన్నప్పటి నుంచే చెబుతూ వచ్చారు. మూడేళ్ళప్పుడు ఇలాగే చెప్తుంటే బాబు అడ్డుకున్నాడు. తను చిన్నప్పటి నుంచి ఇవే మాటలు వింటున్నాడని చెప్పాడు. మరి వీటిలో నీకు నచ్చిన పేరు ఏది అని ఆ అమ్మానాన్న చాలా ఆత్రంగా అడిగారు. ఆ పిల్లాడేం చెప్పాడో తెలుసా? “బెట్టీ క్రాకర్ (Betty Crocker)”! పాపం అన్ని పేర్లు పెట్టిన ఆ అమ్మానాన్న శ్రమ ఇలా వృథా అయిపోయింది.

మాల్టాలో ఒక‌రికే చాలా పేర్లు ఉండ‌టం చాలా సాధారణం, కానీ మధ్య పేర్ల విషయానికి వస్తే బేబీ రెయిన్ తల్లిదండ్రులు మ‌రో అడుగువేశారు. ఫ్రెండ్స్ చెప్పిన పేర్లలను క‌లిపిపెట్టారు.

 

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet