iDreamPost
android-app
ios-app

ముచ్చటగా మూడోసారి క్రేజీ కాంబో ?

  • Published Aug 09, 2021 | 5:52 AM Updated Updated Aug 09, 2021 | 5:52 AM
  • Published Aug 09, 2021 | 5:52 AMUpdated Aug 09, 2021 | 5:52 AM
ముచ్చటగా మూడోసారి క్రేజీ కాంబో ?

ఇప్పుడంటే పూజా హెగ్డే టాప్ హీరోయిన్ గా వెలిగిపోతోంది కానీ ఒకప్పుడు తనను ఐరన్ లెగ్ అని పిలిచేవారు. టాలీవుడ్ లో మొదటి సినిమా ముకుంద ఫ్లాప్. రెండోది ఒక లైలా కోసం సోసోగానే ఆడింది. ఇది అభిమానులకు తప్ప మిగిలినవారికి పెద్దగా గుర్తు లేనంతగా పేరు తెచ్చుకుంది. కట్ చేస్తే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో చేసిన మొహంజాదారో కూడా డిజాస్టర్. తమిళంలో రంగం హీరో జీవాతో డెబ్యూ చేసిన మాస్క్ కూడా అట్టర్ ఫ్లాప్. మూడు భాషల్లోనూ ఇలాంటి వెల్కమ్ దొరికితే ఎవరికైనా ఇబ్బందే కదా. పూజా హెగ్డేకు సైతం ఇదే అనుభవమయ్యింది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవుగా. తర్వాత ఆ కోరుకున్న రోజు వచ్చింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో డీజే దువ్వాడ జగన్నాధం ఎప్పుడైతే ఒప్పుకుందో ఆ క్షణం నుంచే పూజా హెగ్డే జాతకం మారిపోయింది. ఆ సినిమా మరీ భుజాలు ఎగరేసేంత ఇండస్ట్రీ హిట్ కాకపోయినా అందరికంటే ఎక్కువ ఫేమ్ వచ్చింది మాత్రం పూజకే. ముఖ్యంగా అందులో గ్లామర్ షో దెబ్బకు ఇండస్ట్రీ జనాలు తన వైపు చూడటం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. పాన్ ఇండియా సినిమాలు చేసే దాకా రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు వందల కోట్ల మార్కెట్ ఉన్న ప్రతి స్టార్ కి పూజా హెగ్డే నే ఫస్ట్ ఛాయస్ గా నిలుస్తోంది. తమిళం నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి.

తాజా అప్ డేట్ ప్రకారం అల్లు అర్జున్ తో పూజా మరోసారి జట్టు కట్టవచ్చని సమాచారం. పుష్ప పార్ట్ 1 తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయడం దాదాపు ఖాయమేనట. దాని క్యాస్టింగ్ లో భాగంగా ఫస్ట్ ఆప్షన్ గా పూజానే ఎంచుకున్నట్టు తెలిసింది. గత ఏడాది అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన ఈ జంటను మరోసారి రిపీట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన టీమ్ కు వచ్చినట్టు వినికిడి. అయితే అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, అది పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్ విని బన్నీ తుది నిర్ణయం తీసుకుంటాడని చెబుతున్నారు. లెట్ వెయిట్ అండ్ సి

Also Read : సూపర్ స్టార్ మాస్ అవతారం

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet