iDreamPost
android-app
ios-app

వాసన, రుచి తెలియడం లేదా..?

  • Published Oct 03, 2020 | 1:52 PM Updated Updated Oct 03, 2020 | 1:52 PM
వాసన, రుచి తెలియడం లేదా..?

కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వంద మందిలోనూ 80 మందికి ఎటువంటి లక్షణాలు ఉండడం లేదు. కానీ వాళ్ళ టెస్టు ఫలితం పాజిటివ్‌గా వస్తోంది. సాధారణంగా ఈ వైరస్‌ భారిన పడితే జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు తదితర లక్షణాలు ఉంటాయని విస్తృతంగానే ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ ఇటువంటి లక్షణాలేమీ కూడా టెస్టుఫలితం పాజిటివ్‌ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కోవిడ్‌పై జనంలో ఒక రకమైన నిర్లక్ష్యభావన కూడా చోటు చేసుకుంటోందనే చెప్పాలి. ఏమీ లేకుండా కూడా పాజిటివ్‌ వచ్చేస్తోంది.. అంటూ లైట్‌ తీసుకుంటున్నారు. తద్వారా తాముగానీ, తమ ఇంట్లో వాళ్లను గానీ ప్రమాదంలోకి నెడుతున్నారు.

ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో లండన్‌లో జరిగిన ఒక పరిశోధనలో వాసన, రుచి కోల్పోయినప్పటికీ అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాల్లేకుండా వ్యాపిస్తున్న వైరస్‌ను సులభంగా గుర్తించేందుకు ఇప్పుడీ రెండు లక్షణాలే కీలకం కాబోతున్నాయని వారు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో భాగంగా లండన్‌లో సేకరించిన శాంపిల్స్‌లో రుచి, వాసన లేని వాళ్ళను పరీక్షిస్తే ప్రతి అయిదుగురిలోనూ నలుగురు కోవిడ్‌ భారిన పడ్డట్టు తేలింది. దీంతో రుచి, వాసన కోల్పోతే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఇప్పుడు అక్కడ సూచిస్తున్నారట.

ప్రస్తుతం కోవిడ్‌ భారిన పడ్డవారిని గుర్తించడంలో టెస్ట్, ట్రేస్, ట్రీట్‌మెంట్‌ పద్దతిలో వైద్య విధానం కొనసాగుతోంది. ఇక్కడ టెస్ట్, ట్రేస్‌ అనేవి అత్యంత కీలకమైనవి. వీటి కోసం వైద్య బృందాలు నేరుగా జనం వద్దకు వెళ్ళడం గానీ, లేదా జనం వచ్చి పరీక్షలు చేయించుకోవడం గానీ జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి ఇరువైపులా ఉండే నిర్లక్ష్యం కారణంగా రోగులకు ప్రాణాంతకమవుతున్న సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి.

ఇదిలా ఉండగా కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ఇంకా తీవ్రంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అటువంటి పరిస్థితుల్లో రుచి, వాసన కోల్పోయిన వారిని వెంటనే గుర్తించి వైద్య సదుపాయం అందజేస్తే ప్రమాదానికి దగ్గరగా వెళ్ళేవాళ్ల సంఖ్యను తగ్గించొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరంతో పాటు రుచి, వాసన తెలియకపోయినప్పటికీ వైద్యపరీక్ష చేయించుకుని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. తద్వారా వారిని వారు కాపాడుకోవడంతో పాటు, ఇతరులను కూడా కాపాడినవారవుతారని వివరిస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler