iDreamPost
android-app
ios-app

లేటు వయసులో కాలేజీ హిట్టు – Nostalgia

  • Published Jul 14, 2020 | 2:11 PM Updated Updated Jul 14, 2020 | 2:11 PM
లేటు వయసులో కాలేజీ హిట్టు – Nostalgia

సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఒక వయసుకు వచ్చాక పాత్రల విషయంలో కొంత రాజీ, పట్టువిడుపు తప్పవు. అన్నిసార్లు ప్రయోగాలు ఫలించకపోవచ్చు. కానీ అలాంటివి లెక్క చేయకుండా రిస్క్ తీసుకోవడంలో అక్కినేని నాగేశ్వర్ రావు గారు ముందుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు పదుల వయసులో శ్రీదేవితో డాన్స్ చేస్తూ ‘ప్రేమాభిషేకం’లో లవర్ బాయ్ గా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ఆయనకే చెల్లింది.ఇది జరిగిన తొమ్మిదేళ్ళకే మీనా లాంటి టీనేజ్ అమ్మాయికి తాతగా బట్టతలతో ‘సీతారామయ్య గారి మనవరాలు’తో మెస్మరైజ్ చేయడం అరుదైన ఘనత.

నిజానికి అందరూ ఆ టైంలో ఏఎన్ఆర్ ఇంక పూర్తిగా అలాంటి పాత్రలే చేస్తారని అందరూ ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టే మాధవయ్య గారి మనవడు, రాజేశ్వరి కళ్యాణం, ప్రాణదాత సినిమాలు వాటికి బలం చేకూర్చాయి. దాన్ని బ్రేక్ చేస్తూ 1992లో అక్కినేని చేసిన ఒక సూపర్ ప్రయోగం కాలేజీ బుల్లోడు. పెళ్లీడు కొచ్చిన కొడుకు, కూతురున్న ఒక వ్యాపారవేత్త తనకు అవమానం జరిగిందన్న కారణంతో పంతం పట్టి కాలేజీలో స్టూడెంట్ గా చేరి డిగ్రీ పట్టా పుచ్చుకోవడం అనే పాయింట్ చదవడానికి బాగుంటుంది కాని తెరకెక్కించడం అంత ఈజీ కాదు. శరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ద్వారా దాన్ని నిజం చేసి చూపించారు ఏఎన్ఆర్. హరీష్, యమున ఆయన సంతానంగా నటించగా రాధికా మరో కీలక పాత్రలో కనిపిస్తారు. అక్కినేనిని రెచ్చగొట్టి కాలేజీ చేరేలా చేయడంలో సత్యనారాయణ గారి రోల్ కూడా కీలకంగా ఉంటుంది.

సత్యానంద్ సంభాషణలు చక్కగా కుదరగా రాజ్ కోటి సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా ‘ర్యాగింగ్ ఆట రాగాలాట’ పాటలో ఏఎన్ఆర్ స్టెప్పులు మాములుగా ఉండవు. ఆ టైంలో స్పీడ్ డాన్సర్ గా ఉన్న డిస్కో శాంతి సైతం ఈయన నృత్యాన్ని చూసి షాక్ తినడం అప్పట్లో పలు పత్రికల్లో వచ్చింది. ఎక్కడా విసుగు లేకుండా ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్, కామెడీ అన్నీ సమపాళ్ళలో కూర్చిన కాలేజీ బుల్లోడు ఘన విజయం సాధించింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి మాస్ హీరోల ఉదృతి సాగుతున్న టైంలో లేట్ ఏజ్ లో తమ హీరో కొట్టిన హిట్టు చూసి అభిమానులు ఎంతగా మురిసిపోయారో. ఈ సినిమా తర్వాత అక్కినేని మునుపటి కంటే చాలా బిజీ అయిపోయి రథసారధి, గాడ్ ఫాదర్ లాంటి సోలో సినిమాలు చాలా చేశారు. కానీ అవేవి కాలేజీ బుల్లోడు స్థానాన్ని తీసుకోలేకపోయాయి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/