మరో పథకానికి నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌!

మరో పథకానికి నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తనదైన పరిపాలనతో దేశంలోని ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అలానే విద్యా, వైద్య విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యువతకు, పిల్లలకు చదువు భారం కాకూడదని.. అనేక పథకాలు అమలు చేస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి ఇతర అనేక పథకాల ద్వారా విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. తాజాగా వైఎస్సాఆర్ లా నేస్తం కింద నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.

యువ న్యాయవాదులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్ లా నేస్తం కింద సోమవారం విడుదల చేశారు. 2023-24 ఏడాదికి తొలివిడత  కింద అర్హులైన 2,677 మంది యంగ్ లాయర్ల అకౌంట్ లో నెలకు రూ.5 వేల చొప్పున జమ  చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలలకు ఒక్కొక్కరి అకౌంట్లలో రూ.25 వేలు జమకానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..” నాలుగు సంవత్సరాలుగా లా నేస్తం అమలు చేస్తున్నాం. 2677 మంది అడ్వకేట్‌ చెల్లెమ్మలకు, తమ్ములకు రూ.6.12 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాము. లా కోర్సు పూర్తిచేసిన, తొలి మూడేళ్లలో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నాం. ఇలా మూడేళ్లలో అర్హులైన  ఒక్కొక్కరికీ రూ.1.8లక్షలు ఇస్తున్నాం.

దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారు. మంచి ఆలోచనతో ఈ పథకం ప్రారంభించాం. ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుది. జూనియర్లుగా ఉన్న ప్రతి లాయర్ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం  పేదల పట్ల చూపిస్తారని నమ్ముతున్నాను. ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి నుంచి ఆశిస్తున్నది ఇదే’ అని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక సాయం కోరే లాయర్లు ఆన్‌లైన్‌లో  సంబంధిత వెబ్ సైట్ ద్వారా నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్సార్‌ లా నేస్తం పథకానికి సంబంధించి లాయర్లు ఇబ్బందులను అధిగమించేందుకు 1902 నంబర్‌ను అందుబాటులో ఉంచింది. మరి.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments