iDreamPost
iDreamPost
కరోనా సెకండ్ లాక్ డౌన్ ముగిసిపోయి థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తుండటంతో మెల్లగా పాన్ ఇండియా సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్లను లాక్ చేసుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, ఆచార్య లు తేదీలను ప్రకటించేయగా తాజాగా అడివి శేష్ మేజర్ కూడా ఫిబ్రవరి 11న రాబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పేశారు. అదే రోజు ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాని గతంలోనే షెడ్యూల్ చేశారు. సో అడివి శేష్ తో ఆమిర్ ఖాన్ ఢీ కొట్టడం ఖాయమయ్యింది. రెండు సంబంధం లేని జానర్లే అయినప్పటికీ ఆమిర్ ఇమేజ్ తో పోల్చుకుంటే శేష్ కి నార్త్ లో అంతగా గుర్తింపు లేదు. కానీ కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు.
మరో విశేషం ఏంటంటే రెండు సినిమాల కాన్సెప్ట్ లు జనానికి తెలిసినవే. లాల్ సింగ్ చద్దాని 90 దశకంలో వచ్చిన హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా రూపొందిస్తున్నారు. దర్శకుడు అద్వైత్ చందన్. ఇందులో నాగ చైతన్య ఒక స్పెషల్ క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. తన పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు. ఫారెస్ట్ గంప్ చూసినవాళ్లకు స్టోరీ పరంగా పెద్ద సస్పెన్స్ ఉండదు. ఇక మేజర్ సంగతి చూస్తే ముంబై టెర్రర్ ఎటాక్స్ ని బేస్ చేసుకుని గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దీన్ని తీర్చిదిద్దారు. ఇదే సబ్జెక్టుతో హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి కానీ మేజర్ లో ఉన్నికృష్ణన్ త్యాగాన్ని డీటెయిల్డ్ గా చూపించబోతున్నారు.
మొత్తానికి వచ్చే ఏడాది ప్రతి శుక్రవారం పాన్ ఇండియా సినిమాలతో భారీ యుద్ధం ఉండబోవడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా తక్కువ గ్యాప్ లో అన్నీ తలపడనున్నాయి. ఏప్రిల్ మేల దాకా డేట్లు బ్లాక్ అవుతున్నాయి. బాక్సాఫీస్ కుదుటపడినట్టు కనిపిస్తోంది. ఇటీవలే శివ కార్తికేయన్ డాక్టర్ కేవలం తమిళ వెర్షన్ నుంచే 90 కోట్ల దాకా వసూళ్లు తేవడం అందరికి జోష్ ఇచ్చింది. ఒకవేళ సూర్యవంశీ కనక డబుల్ సెంచరీ మార్కు కనక దాటేస్తే ఆర్ఆర్ఆర్ లాంటివాటికి ఎలాంటి ఢోకా ఉండదు. ఫ్యామిలీ ఆడియెన్స్ మునుపటి స్థాయిలో వస్తున్నారని అర్థమైపోతుంది. పుష్ప ఎలాగూ డిసెంబర్ లో వచ్చేస్తుంది కాబట్టి అదీ ఆడితే టాలీవుడ్ కు ఏ టెన్షన్ లేనట్టే
Also Read : Bheemla Nayak : ఎంత పోటీ ఉన్నా పవన్ టీమ్ తగ్గడం లేదు