iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీ ‘పెద్ద బాధ్యతలు’ వద్దు.. బిడ్డగా ఉంటా, భుజమందిస్తా!

ఇండస్ట్రీ ‘పెద్ద బాధ్యతలు’ వద్దు.. బిడ్డగా ఉంటా, భుజమందిస్తా!

ఒకరకంగా దాసరి నారాయణరావు బతికున్నంతకాలం తెలుగు సినీ పరిశ్రమకు ఆయన పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు. సినీ పరిశ్రమలో ఎలాంటి వివాదాలు ఏర్పడినా లేక ఎలాంటి సమస్యలు ఏర్పడినా వాటిని దాసరి నారాయణరావు ముందుకు తీసుకు వెళ్లడం, ఆయన ఏం చెబితే దాన్ని గుడ్డిగా ఫాలో అయి పోతూ ఉండటం జరిగేది. పెద్దాయన ఏం చెప్పినా మన మంచికే అని ఇరు వర్గాల వారు భావిస్తూ ఉండేవారు.

అయితే ఆయన మరణానంతరం ఇండస్ట్రీకి ఆ పెద్ద దిక్కు ఎవరు అనేది ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. అయితే ఆ పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి అని కొంత మంది భావిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇండస్ట్రీలో ఎవరు ఇబ్బందులు పడుతున్నారు అని తన దృష్టికి వచ్చినా, వెంటనే వారికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కరోనా సమయంలో షూటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్న కార్మికులందరినీ ఆదుకోవడం కోసం సినీ క్రైసిస్ ఛారిటీ అనే ఒక ఛారిటీ ఫండ్ ఏర్పాటు చేసి తాను డబ్బు ఇవ్వటమే కాక తన సహచర హీరోలు, నటీనటులు దర్శకనిర్మాతల విరాళాలు పోగు చేసి వారి ఆకలి తీర్చారు. దీంతో ఒక రకంగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు అని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ తనకు ఆ పెద్దదిక్కు అనే పదం నచ్చదు అని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొద్ది రోజుల క్రితం యోధ డయాగ్నస్టిక్ సెంటర్ అనే ఒక డయాగ్నస్టిక్ సెంటర్ ఓపెనింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు కూడా ఏదైనా సహాయం చేయమని సదరు డయాగ్నస్టిక్ సెంటర్ యజమాని సుధాకర్ రెడ్డిని కోరారు. ఆయన కూడా చిరంజీవి లాంటి మనిషి అడిగితే ఊరుకుంటామా? అన్నట్లు సినీ పరిశ్రమ నుంచి ఎవరు వచ్చినా వారికి 50 శాతం రాయితీతో మేము టెస్టులు చేస్తామని మాట ఇచ్చారు. అయితే ఒక సిస్టమేటిక్ గా నడపడం కోసం సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ లకు సంబంధించిన అన్ని యూనియన్ సభ్యులకు హెల్త్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా 18 యూనియన్లో హెల్త్ కార్డులు రావడంతో వాటిని ఆదివారం నాడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలోనే సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ ‘‘గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు ఎవరూ లేరు. ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన ఉన్నారని మాకు ఓ ధైర్యం ఉంటుంది’’ అని తన కోరికను బయట పెట్టారు.

అయితే ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి మైక్ తీసుకున్న చిరంజీవి ఎవరూ ఊహించని విధంగా వ్యాఖ్యానించారు. పెద్దరికం అనేది ఒక హోదాగా, ఒక పదవిగా అనిపించుకోవడం నాకు ససేమిరా ఇష్టం లేదు అని మెగాస్టార్ తేల్చి చెప్పారు. నేను పెద్దగా ఉండను, కానీ బాధ్యత గల ఒక బిడ్డ గా ఉంటాను, అవసరం వచ్చినప్పుడు నేనున్నానంటూ ముందుకు వస్తాను, కానీ అవసరం లేనప్పుడు మాత్రం తగుదునమ్మా అంటూ ముందుకు వచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. అది పదవి అనుకోండి హోదా అనుకోండి అది మాత్రం నాకు వద్దు, ఎలాంటి సమయంలోనైనా అవసరం వస్తే, ఏదైనా క్రైసిస్ వస్తే, ఇండస్ట్రీకి నా భుజం అవసరమైనప్పుడు, ఖచ్చితంగా నా భుజం అందిస్తానని చెప్పుకొచ్చారు.

బాధ్యతగా ఉంటా మీకు అందుబాటులో ఉంటా, కానీ ఎవరో ఇద్దరు కొట్టుకుని ఆ తర్వాత తగవు తీర్చమని వస్తే, నేను తీర్చను, నాకు వద్దు. అవసరం అనుకుంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి లేక ఉపాధి సమస్య కానివ్వండి, మరో సమస్య కానివ్వండి ఖచ్చితంగా నేను అండగా ఉంటాను అని అన్నారు. సమగ్రంగా పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని అవసరం అనుకుంటే తాను ఎంత వరకు అయినా వెళతానని అన్నారు. ఒకటి రెండు యూనియన్లను దృష్టిలో పెట్టుకొని లేదా ఇద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని, పంచాయతీలు చేయమంటే నేను చేయను అని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటా కానీ ఇండస్ట్రీకి పెద్ద అనిపించుకోవడం నాకు ఇబ్బంది అని చెప్పుకొచ్చారు.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetjojobetMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş