దాడికి సిద్ధం చేస్తూ.. తానే దాడికి గురయ్యిందా?

ప్రస్తుతం యుద్ధం తీరు మారింది. బాంబులు, తుపాకులతో ఎదురెదురుగా పోటీ పడే విధానానికి దేశాలు స్వస్తి పలుకుతున్నాయి. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థను, మానవ వనరులను ఇబ్బందులకు గురిచేసేందుకు జీవాయుధాలను తయారు చేసుకుంటున్నాయి కొన్ని దేశాలు. ఆ మధ్య కొన్నేళ్ల కిందట సూర్య నటించిన సెవెన్త్‌ సెన్స్‌ అనే సినిమా వచ్చింది. అందులో చైనా నుంచి ఒకతను వచ్చి ఇండియాలో ఒక కొత్త రకం వైరస్‌ను వీధి కుక్కకు ఇంజెక్ట్‌ చేస్తాడు. ఆ కుక్క నుంచి ఇతర కుక్కలకు, అక్కడి నుంచి మనుషులకు వైరస్‌ సోకి రోజుల వ్యవధిలో ప్రజలు చనిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఆ చైనా దేశమే దానికి విరుగుడును కనిపెట్టి, దాన్ని మన దేశానికి ఇవ్వడానికి భారీ మొత్తంలో ఆర్థిక వనరులను డిమాండ్‌ చేయాలనేది ఆ దేశం ప్లాన్‌.

ఇదిగో ఇంచుమించుగా ఇలాంటి పథకంలో భాగంగానే చైనా దేశం కరోనా వైరస్‌ అనే జీవాయుధాన్ని తయారు చేసిందా? అనే అనుమానాలు మొదలవుతున్నాయి. చైనాలో మొదలై ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆ కరోనా వైరస్‌ ఎలా పుట్టింది? అన్న దానిపై పలు అంతర్జాతీయ పత్రికలు భిన్న కథనాలకు ప్రచురిస్తున్నాయి. ఇటీవల వాషింగ్టన్‌ టైమ్స్, G న్యూస్‌ లాంటి సంస్థలు చెబుతున్న ప్రకారం.. కరోనా వైరస్‌ అనేది చైనా సృష్టించిన ఒక జీవాయుధం. చైనాలోని వుహాన్‌లో ఓ సముద్రపు జీవుల విక్రయ కేంద్రం నుంచి కరోనా పుట్టిందని ఆ దేశం చెబుతోంది.

అయితే ఆ విక్రయ కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అతిపెద్ద వైరాలజీ ల్యాబ్‌ ఒకటి ఉంది. అక్కడ వివిధ రకాల వైరస్‌ల మీద పరిశోధనలు, చికిత్స మార్గాలపై పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. గతంలో ప్రపంచాన్ని వణికించిన పలు వైరస్‌ల నమూనాలను పరిశోధనల నిమిత్తం ఇక్కడే భద్రపరిచారు. అదే సమయంలో ఈ ల్యాబ్‌లో జీవాయుధాల సృష్టిపై కూడా పరిశోధనలు జరుగుతుంటాయని, అక్కడి నుంచే ఈ వైరస్‌ ప్రమాదవశాత్తు లీక్‌ అయ్యిందని వాషింగ్టన్‌ టైమ్స్, జీ న్యూస్‌ పలు కథనాలను వెలువరించాయి. దీనిపై అంతర్జాతీయ నిపుణులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా లక్షణాలు, సార్స్‌ను పోలి ఉన్నాయని చెబతున్నారు. అయితే ఈ కథనాలను చైనా కొట్టి పారేస్తోంది. త్వరలోనే కరోనా పిశాచికి అడ్డుకట్ట వేస్తామని చెబుతోంది. ఇక చైనా వాదన నిజమా? అంతర్జాతీయ పత్రికల కథనాలు నిజమా అన్నది తేలాల్సి ఉంది. ఏదిఏమైనా జీవాయుధాలపై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Show comments