iDreamPost
android-app
ios-app

విషాదం.. పెళ్లైన 17 ఏళ్లకు సంతానం.. చ‌నిపోయింద‌నుకున్న పాము పిల్లోడ్ని కాటేసింది

  • Published Jun 10, 2022 | 10:08 AM Updated Updated Dec 20, 2023 | 6:28 PM

ఆ ఆనందం రెండేళ్లైనా నిలవలేదు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బైరెడ్డి సంతోష్ - అర్చన దంపతులకు 17 ఏళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన 15 సంవత్సరాలకు నైతిక్ (2) జన్మించాడు. పెళ్లైన చాలా ఏళ్లకు కలిగిన సంతానం కావడంతో..

  • Published Jun 10, 2022 | 10:08 AMUpdated Dec 20, 2023 | 6:28 PM
విషాదం.. పెళ్లైన 17 ఏళ్లకు సంతానం.. చ‌నిపోయింద‌నుకున్న పాము పిల్లోడ్ని కాటేసింది

తాను చనిపోతూ.. అభం శుభం తెలియని పసివాడి ప్రాణాన్ని బలితీసుకుందో విషసర్పం. పెళ్లైన 15 ఏళ్లకు ఆ దంపతులకు సంతానం కలగ్గా.. ఆ ఆనందం రెండేళ్లైనా నిలవలేదు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బైరెడ్డి సంతోష్ – అర్చన దంపతులకు 17 ఏళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన 15 సంవత్సరాలకు నైతిక్ (2) జన్మించాడు. పెళ్లైన చాలా ఏళ్లకు కలిగిన సంతానం కావడంతో.. నైతిక్ ను గారాబంగా పెంచుకుంటున్నారు.

కానీ.. విధి వారి ఆనందాన్ని చూడలేక.. విషసర్పం రూపంలో కాటేసింది. గురువారం మధ్యాహ్నం సంతోష్ ఇంటి ఆవరణలోకి రక్తపింజర పాము ప్రవేశించింది. గుర్తించిన సంతోష్.. స్థానికుల సహాయంతో దానిని కొట్టారు. పాము చనిపోయిందనుకుని స్థానికులు కర్రతో దానిని బయటకు విసిరేశారు. అది సరిగ్గా నైతిక్ పక్కనే పడింది. చనిపోతూ.. నైతిక్ కాలిపై కాటేసింది. వెంటనే బాలుడిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా.. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. లేక లేక పుట్టిన సంతానాన్ని విషసర్పం బలితీసుకోవడంతో.. సంతోష్ – అర్చన దంపతులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom