iDreamPost
android-app
ios-app

శ్రీకాకుళం IIIT ఘనత ఎవరిది బాబు?

  • Published Dec 17, 2019 | 12:52 PM Updated Updated Dec 17, 2019 | 12:52 PM
శ్రీకాకుళం IIIT  ఘనత ఎవరిది బాబు?

ప్రతిపక్ష నేత చంద్రబాబుకి అన్నీ తానే , అంతా తానే అని చెప్పుకునే అలవాటు ఉంది. ఈ మద్య చంద్రబాబు అసెంబ్లీలో అధికార పక్షం పలు అభివృద్ది అంశాలపై వేస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక తీవ్ర ఒత్తిడీకి లోనై ఆ అలవాటుతో తనని తాను రక్షించుకోవాలనే తపనతో తన ప్రమేయం లేని అభివ్రుద్ది పనులు , తన హయాంలో జరగని పనులన్నీ తన హయాంలోనే జరిగాయన్నట్టు అసెంబ్లీ సాక్షిగా చెప్పటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. శ్రీకాకులం బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ నేనే కట్టా అని, అంబేద్కర్ కి భారత రత్న ఇప్పించా అని , అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేశానని చెప్పుకొచ్చారు. ఈ రోజు మరో ముందడుగు వేసి శ్రీకాకులం ట్రిపుల్ ఐ.టి ని నేనే తెచ్చా అని కూడా మాట్లాడారు, ఈ మాటతో సభలో అందరు ఒక్కసారికి నిశ్చేష్ట్రులయ్యారు.

నిజానికి శ్రీకాకుళం ట్రిపుల్ ఐ.టి, వై.యస్ రాజశేఖర రెడ్డి హయాం 2007 ఏప్రిల్లో ఆయన చేసిన కృషి ఫలితంగా ఏర్పాటు అయింది. 2008 మార్చ్ లో రాజీవ్ గాంధీ యూనివర్సిటి ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీని ఒక పరిపూర్ణ యూనివర్సిటిగా గుర్తిస్తూ చట్టం కూడా చేశారు. గ్రామాలలో ఉన్న విద్యార్ధులకు పట్టణాలతో పోలిస్తే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి అవకాశాలు మెరుగుపరిచేందుకే ట్రిపుల్ ఐ.టి ని ఏర్పాటు చేస్తున్నామని, గ్రామీణ విద్యార్ధులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని ఐరోపా లాంటి దేశాల్లో పది తరువాత చదివే విద్యార్ధుల శాతం 50% ఉంటే మన దేశంలో 9.52 శాతం ఉందని , మన రాష్ట్రంలో 11 శాతం ఉందని , గ్రామీణ ప్రజలకు విద్యను అందుబాటులోకి తెస్తే ఖచ్చితంగా 3 ఏళ్ళలో 15% కి చేరుతామనే ఆశ ఉందని ట్రిపుల్ ఐ.టి స్థాపించే సమయంలో చెప్పారు. 2008 ఆగస్టులో మొదటి బ్యాచ్ గా 6,500 మంది విద్యార్ధులు ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో చేరారు. ఇది శ్రీకాకుళం ట్రిపుల్ ఐ.టి స్థాపన వెనక ఉన్న చరిత్ర.

చంద్రబాబు గారు తాను ప్రజల్లో ఎంత చులకన అయినా చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు, తనకి సంబంధంలేని విషయాలకు కూడా తానే చేసానని చెప్పుకోవటం, తన ప్రమేయం లేని వాటిపై తన ముద్ర వేసుకోవాలని ఆరాట పడటమనే ఈ వింత రాజకీయం ఒకానోక కాలం లో ఆశను నెరవేర్చాయేమో కానీ నేడు ఈ విద్య ప్రజా క్షేత్రంలో చెల్లదని గత ఎన్నికల్లోనే రుజువైంది. నిజాలు అనేక మాధ్యమాల రూపంలో ప్రజలముందుకు క్షణాల్లో చేరే రోజులివి. ఇప్పుడు కూడా అదే పద్దతి బాబు అనుసరిస్తే మరింత చులకనయ్యే ప్రమాదం లేకపొలేదు. బాబుగారి పద్దతని నివారించే సహచరుడు లేకపొవడం తెలుగుదేశంకి ఒకింత లోటు అని చెప్పవచ్చు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş