iDreamPost
android-app
ios-app

ప్రియుడి కళ్లెదుటే.. మసాజ్ పేరుతో మహిళపై అత్యాచారం

  • Published Jun 08, 2022 | 11:27 AM Updated Updated Jun 08, 2022 | 11:27 AM
  • Published Jun 08, 2022 | 11:27 AMUpdated Jun 08, 2022 | 11:27 AM
ప్రియుడి కళ్లెదుటే.. మసాజ్ పేరుతో మహిళపై అత్యాచారం

మసాజ్ పేరుతో బ్రిటన్ మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన గోవాలో వెలుగుచూసింది. బ్రిటీష్ కు చెందిన మహిళ జూన్ 2వ తేదీన తన ప్రియుడితో గోవా పర్యటనకు వచ్చింది. అక్కడ బీచ్ కు సమీపంలోని స్వీట్ వాటర్ సరస్సు వద్దకు వచ్చారు. ఆ సమయంలో విన్సెంట్ డిసౌజా (32) అనే వ్యక్తి మసాజ్ చేస్తానంటూ వారి వద్దకు రాగా.. వారిద్దరూ మసాజ్ చేయించుకునేందుకు ఒప్పుకున్నారు.

మసాజ్, మర్దన నెపంతో విన్సెంట్ సదరు మహిళపై ప్రియుడి కళ్లెదుటే అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన దారుణాన్ని బాధిత మహిళ బ్రిటన్ లో ఉన్న తన కుటుంబసభ్యులకు తెలిపి.. భారత్ లో బ్రిటిష్ ఎంబసీ సహాయం కోరింది. ఎంబసీ సూచన మేరకు.. సోమవారం(జూన్ 6) పెర్నెమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని గంటలోగానే నిందితుడు విన్సెంట్ ను అరెస్ట్ చేశారు. అరంబోల్ బీచ్ వద్ద విన్సెంట్, మరికొందరు అనుమతి లేకుండా మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు విన్సెంట్ ను రిమాండ్ కు తరలించారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss