ప‌త‌న‌మ‌వుతున్న‌ పార్టీల నుంచి పాఠాలు చేర్చుకోవాలి, కాంగ్రెస్ పై ప్ర‌ధాని విసుర్లు

హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలన్నారు. అందరికీ స్నేహ‌హ‌స్తాన్ని అందించాల‌ని కోరారు. దానికోస‌మే పార్టీ కార్య‌క‌ర్త‌లు స్నేహ‌యాత్ర‌ను చేప‌ట్టాల‌ని, స‌మాజంలోకి అట్ట‌డుగువ‌ర్గాల‌కు చేరువ‌కావాల‌ని కోరారు.

హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలన్నారు. అందరికీ స్నేహ‌హ‌స్తాన్ని అందించాల‌ని కోరారు. దానికోస‌మే పార్టీ కార్య‌క‌ర్త‌లు స్నేహ‌యాత్ర‌ను చేప‌ట్టాల‌ని, స‌మాజంలోకి అట్ట‌డుగువ‌ర్గాల‌కు చేరువ‌కావాల‌ని కోరారు.

రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. చివ‌ర్లో ప్ర‌ధాని మోదీ, బీజేపీకి క‌ర్త‌వ్య‌బోధ చేశారు. హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలన్నారు. అందరికీ స్నేహ‌హ‌స్తాన్ని అందించాల‌ని కోరారు. దానికోస‌మే పార్టీ కార్య‌క‌ర్త‌లు స్నేహ‌యాత్ర‌ను చేప‌ట్టాల‌ని, స‌మాజంలోకి అట్ట‌డుగువ‌ర్గాల‌కు చేరువ‌కావాల‌ని కోరారు.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో రెండు రోజుల సమావేశం శనివారం ప్రారంభమైంది. ప్రవక్త ముహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యల ర‌గ‌డ‌, అగ్నిపథ్‌పై నిరసనల వేళ‌, స‌స్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు తీవ్ర విమర్శలు చేసిన రోజు త‌ర్వాత, బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌రిగాయి.


పటేల్‌ వల్లే ఈరోజు దేశంలో తెలంగాణలో ఉందన్న‌ ప్రధాని , 119 నియోజకవర్గాలకు వెళ్లిన జాతీయ ప్రతినిధులను మోదీ అభినందించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో గెలుపు స్ఫూర్తితో పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

అంతిమంగా తిరోగమనంలో ఉన్న పార్టీల తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ అన్నారు. భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీలు ఇప్పుడు అంతిమంగా పతనమవుతున్నాయి. ఈ స‌మ‌యంలో మనం వారిని ఎగతాళి చేయకూడదు. వారి తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు.

దేశంలో బీజేపీ వేగంగా విస్తరిస్తోందని ప్ర‌ధాని మోదీ అన్నారు. తెలంగాణ, ప‌శ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తల ధైర్యాన్ని ప్ర‌శంసించారు.

వార‌స‌త్వ రాజ‌కీయాలు, కుటుంబ‌ రాజకీయ పార్టీలతో దేశం విసిగిపోయింది; అలాంటి పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించడం క‌ష్ట‌మ‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

భాగ్యనగరంలో సర్దార్ పటేల్ మ‌న‌కు ‘ఏక్ భారత్’ ఇచ్చారు. ఈ రోజు మన దేశాన్ని శ్రేష్ఠ్‌ భారత్ గా మార్చడానికే ఈ బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌ని ప్ర‌ధాని అన్నారు.

 

Show comments