Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు డివిజన్ల వారీగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన పోస్టల్ బ్యాలెట్‌లలో బీజేపీ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో 92 డివిజన్‌లలో బీజేపీ, టీఆర్‌ఎస్ 33, ఎంఐఎం 15, కాంగ్రెస్ 4 డివిజన్లలో ఆధిక్యంలో నిలిచాయి. పాత బస్తీ డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో నిలిచి అందరిలోనూ ఆసక్తిని రేపింది.
ఇతర డివిజన్లలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు అధికార టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు. సాధారణంగా ఉద్యోగులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్ధతు ఇస్తుంటారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ ఉద్యోగులు బీజేపీకి జై కొట్టడం విశేషం. 1926 ఉద్యోగులు ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయం బీజేపీకి అనుకూలంగా ఉండగా.. ఇక ఓటర్ల మనోగతం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. 11 గంటల తర్వాత తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితం వెల్లడికానుంది. తొలి రౌండ్‌తోనే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది.