iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటికి చేదు అనుభవం.. గంటల తరబడి..

  • Published Jan 13, 2024 | 9:42 PM Updated Updated Jan 13, 2024 | 9:42 PM

విమానాశ్రయాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, క్రీడాకారులకు ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తమకు జరిగిన అనుభావాలను సోషల్ మాద్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు.

విమానాశ్రయాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, క్రీడాకారులకు ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తమకు జరిగిన అనుభావాలను సోషల్ మాద్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు.

ప్రముఖ నటికి చేదు అనుభవం.. గంటల తరబడి..

సాధారణంగా విమాన సేవలకు ఏదైనా అంతరాయం జరిగినా.. అవకతవకలు జరిగినా వెంటనే సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. విమాన సిబ్బంది, పైలట్ల పనితీరు, విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సంబంధించిన ఏదైనా ఘటనలు, విమానాల హైజాక్, సాంకేతిక లోపాల వల్ల జరిగే ప్రమాదాలు, ఫుడ్ ఇలా ఎన్నో విషయాలు నిమిషాల్లో నెట్టింట వైరల్ అవుతుంటాయి. విమానాశ్రయంలో సెలబ్రెటీలు రక రకాల అనుభవాలు ఎదుర్కొంటారు. ఎయిర్ పోర్ట్ లో ఒక్కోసారి సెలబ్రెటీలు చేదు అనుభవం ఎదర్కొవాల్సి వస్తుంది. అలాంటి చేదు అనుభవం ప్రముఖ సినీ నటికి ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రక్త చరిత్ర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత బాలయ్య నటించిన లెజెండ్, లయన్ మూవీలో నటించింది. కబాలి చిత్రంలో రజినీకాంత్ సరసన నటించింది. దక్షిణాది చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. విమాన సిబ్బందిపై నటి రాధికా ఆప్టే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ రోజు ఉదయం 8.30 గంటలకు నేను ప్రయాణించాల్సిన విమానం 10.50 గంటలు అయినా రాలేదు. ఓ వైపు ఎయిర్ పోర్ట్ సిబ్బంది విమానం బయలుదేరుతుందని అనౌన్స్ మెంట్ చేసి ప్రయాణికులందరినీ ఏరో బ్రిడ్జ్ వద్దకు తీసుకువెళ్లి మూసివేశారు. అక్కడ చిన్నపిల్లలు, వృద్దులు సహా ప్రయాణికులు గంటలకు పైగా వెయిట్ చేస్తూ ఉండిపోయాం. సిబ్బంది తలుపులు ఓపెన్ చేయకుండా ఏ సమస్య లేదు, ప్రయాణం ఆలస్యం కాదు’అంటూ చెబుతూ వచ్చారు.

మధ్యాహ్నం 12 గంటల వరకు ఎరో బ్రిడ్జ్ పైనే వెయిట్ చేస్తూ చాలా ఇబ్బందులు పడ్డాం. కనీసం ఇక్కడ తాగేందుకు నీరు కూడా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ‘ఇలాంటి ఫన్ రైడ్ అందించినందుకు ఎయిర్ లైన్స్ కి ధన్యవాదాలు’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఏరో బ్రిడ్జిపై ఉన్న ప్రయాణికుల ఫోటోలు, వీడియో క్లిప్ ని ఆమె షేర్ చేశారు. అయితే ఆ విమాన సంస్థ, ప్రదేశం వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు సెలబ్రెటీలకు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş